టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. సిట్ వేసే యోచనలో ప్రభుత్వం..!
ఈ కేసులో దాడికి పాల్పడిన వారిలో ఇప్పటికే కొందరిని పోలీసులు గుర్తించారు. పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు.

Tdp Central Office Attack Case (Photo Credit : Google)
Tdp Central Office Attack Case : గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసును ప్రస్తుత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు విచారణకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇతర జిల్లాల నేతల ప్రమేయం ఉండటంతో విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసే యోచనలో చంద్రబాబు సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో దాడికి పాల్పడిన వారిలో ఇప్పటికే కొందరిని పోలీసులు గుర్తించారు. పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసును మంగళగిరి పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : టీటీడీ చైర్మన్ పదవిని అశోక్ గజపతిరాజు వద్దనుకోవడానికి కారణం అదేనా?