మచిలీపట్నంలో బాబు..హారతులతో స్వాగతం

  • Published By: madhu ,Published On : January 9, 2020 / 10:53 AM IST
మచిలీపట్నంలో బాబు..హారతులతో స్వాగతం

Updated On : January 9, 2020 / 10:53 AM IST

ఉత్కంఠ నడుమ టీడీపీ అధినేత చంద్రబాబు మచిలీపట్నంకు చేరుకున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారుతులిచ్చారు. పూలు కురిపిస్తూ స్వాగతం పలికారు. జై..బాబు..అనే నినాదాలు మారుమోగాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారు. రాజధానిపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా..పురవీధుల్లో బాబు బిక్షాటన చేయనున్నారని తెలుస్తోంది.

 

కొన్ని రోజులుగా దీక్షలు చేస్తున్న సంఘీభావం తెలిపి..వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప చేయనున్నారు బాబు. తర్వాత కోనేరు సెంటర్‌లో నిర్వహించే భారీ బహిరంగసభలో బాబు ప్రసంగించనున్నారు. మూడు ముక్కలు చేయవద్దు, అమరావతి రాజధానిగా ఉండాలంటూ కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2020, జనవరి 08వ తేదీ అమరావతి పరిరక్షణ జేఏసీ తలపెట్టిన బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో బెంజ్ సర్కిల్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

పాదయాత్రగా వెళ్లిన బాబు, జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేసి కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. మచిలీపట్నానికి వెళుతానని బాబు ప్రకటించడంతో ఆయన పర్యటనపై టెన్షన్ నెలకొంది. 2020, జనవరి 09వ తేదీ గురువారం ఉదయం నివాసం నుంచి బాబు బయటకు రానిస్తారా ? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. జేఏసీ కార్యాలయంలో మీటింగ్‌లో పాల్గొన్న బాబు..అనంతరం మచిలీపట్నంకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. మరి బహిరంగసభలో బాబు ఎలా ఫైర్ అవుతారో చూడాలి. 

Read More : మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ : ప్రత్యేక షోలకు పచ్చ జెండా