Narsipatnam : అందరి ముందే చెప్పుతో కొట్టుకున్న టీడీపీ కౌన్సిలర్.. అసలేం జరిగిందంటే
నమ్మి ఓట్లు వేసిన వారికి న్యాయం జరగడం లేదని రామరాజు కన్నీరు పెట్టుకున్నారు. అధికారుల వైఖరికి నిరసనగా ఆయన తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. Narsipatnam

Narsipatnam TDP Councillor
Narsipatnam TDP Councillor : అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. తన వార్డులో అభివృద్ధి పనులకు అధికారులు సహకరించడం లేదని ఆరోపిస్తూ ఓ టీడీపీ కౌన్సిలర్ తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. 20వ వార్డుకు చెందిన కౌన్సిలర్ రామరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ తన వార్డులో రోడ్లు వేయడం లేదని, కనీసం ఒక్క ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
కనీసం చెత్తను తొలగించమని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. నమ్మి ఓట్లు వేసిన వారికి న్యాయం జరగడం లేదని రామరాజు కన్నీరు పెట్టుకున్నారు. అధికారుల వైఖరికి నిరసనగా ఆయన తన చెప్పుతో తానే కొట్టుకున్నారు.
Also Read.. TDP : టీడీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా, పార్టీకి వైరస్ పట్టుకుందని కంటతడి
మున్సిపల్ అధికారులు సహకరించడం లేదంటూ టీడీపీ కౌన్సిలర్ రామరాజు తన చెప్పుతో తానే కొట్టుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. జగన్ పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అభివృద్ధి పనులకు సహకరించకుండా పాలకులు ప్రతిపక్ష నేతలను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.