Nara Lokesh : ఏపీలో డ్రగ్స్ దందాపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు
డ్రగ్స్ కు యువత జీవితాలు నాశనం అవుతున్నాయని దయచేసి దీనిపై విచారణ జరిపించి దీనికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను లోకేశ్ కోరారు.

Nara Lokesh Governor Abdul Nazeer
Nara Lokesh : భారతదేశానికి డ్రగ్స్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతోందంటూ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర (Abdul Nazeer) కు టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh )ఫిర్యాదు చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (Directorate of Revenue Intelligence) నివేదిక ప్రకారం 2021-22సంవత్సరంలో డ్రగ్స్ సరఫరాలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని దానికి సంబంధించిన ఆధారాలతో సహా గవర్నరకు అందజేశారు లోకేశ్. జాతీయ భద్రతకు ముప్పు తెచ్చేలా రాష్ట్రంలో జరుగుతున్న హవాలా లావాదేవీలు ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
Amanchi Swamulu: చీరాలలో కీలక పరిణామాలు.. పవన్ సమక్షంలో జనసేనలోకి ఆమంచి స్వాములు..
ఈ డ్రగ్స్ కు యువత జీవితాలు నాశనం అవుతున్నాయని దయచేసి దీనిపై విచారణ జరిపించి దీనికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను లోకేశ్ కోరారు. డ్రగ్స్ ద్వారా సమాజాన్ని నాశనం చేసే చర్యలను నివారించి సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసివారిలో నారా లోకేష్ తో పాటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు షరీఫ్, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర ఉన్నారు.
గవర్నర్ కు లోకేష్ అందచేసిన నివేదికలో అంశాలు ఇలా ఉన్నాయి..
వైకాపా నేతల ప్రమేయంతోనే రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరా జరుగుతోంది..
సొంత పార్టీ నేతల ప్రమేయం ఉన్నందునే డ్రగ్స్ నియంత్రణపై వైకాపా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు..
డ్రగ్స్ ఉత్పత్తి లేదా స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వారిలో అనేకం వైకాపా నేతలే ఉండటం యాదృచ్ఛికం కాదు..
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా కొండపైనా డ్రగ్స్ అక్రమ రవాణా జరగటం కలవరపెడుతోంది..
డీఆర్ఐ నివేదిక ప్రకారం 2021-22లో ఏపీలోనే 18,267.84 కేజీల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి..
కందుకూరు, అనకాపల్లి ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులు సైతం మాదకద్రవ్యాల బారీన పడిన ఉదంతాలు వెలుగుచూశాయి..
రాష్ట్రంలో డ్రగ్స్ ప్రేరిత నేరాల రేటు ఎక్కువగా ఉంది..
గత నాలుగేళ్లలో యువత మత్తులో మహిళలను వేధించడం, దోచుకోవడం, దాడులు చేయడం వంటి ఘటనలు అనేకం..
మైనర్లు సైతం హంతకులుగా మారిన ఘటనలు చోటుచేసుకున్నాయి..
ఆంధ్రప్రదేశ్ లో మాదకద్రవ్యాలు అన్ని వయసుల వారికీ అందుబాటులో ఉండటం దురదృష్టకర పరిణామం..
పాఠశాలు, కళాశాలల అనే తేడా లేకుండా విద్యార్థులపై ఈ మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది..
2021 సెప్టెంబర్ 19న ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ.9వేల కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాల మూలం విజయవాడ, కాకినాడలుగా తేలింది..
కాకినాడ కేంద్రంగా బియ్యం ఎగుమతి చేసే కంపెనీని రిజిస్టర్ చేసి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు డీఆర్ఐ నిర్థారించింది..
మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పట్టుబడిన మాదకద్రవ్యాల మూలం ఏపీనేని ఆయా రాష్ట్ర పోలీసులు బహిర్గతం చేశారు..
‘యువగళం పాదయాత్ర’లో డ్రగ్స్ వల్ల తమ పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయని వారి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకొచ్చారు..