Lokesh YuvaGalam: అప్పుడు ‘వస్తున్నా మీకోసం’.. ఇప్పుడు యువగళం..! అగనంపూడిలో ముగియనున్న లోకేశ్ పాదయాత్ర
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైంది. మొత్తం 97 నియోజకవర్గాల్లో ...

Chandrababu and Lokesh
Yuva Galam : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగియనుంది. ఇవాళ సాయంత్రం విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద యాత్ర ముగుస్తుంది. ఈనెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద యువగళం పాదయాత్ర జైత్రయాత్ర విజయోత్సవ సభను నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో విజయోత్సవ సభకు టీడీపీ శ్రేణులు తరలిరానున్నారు. ఇందుకోసం టీడీపీ అధిష్టానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
Also Read : Yuvagalam: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు భారీ ఏర్పాట్లు
కుప్పం నుంచి అగనంపూడి వరకు..
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైంది. మొత్తం 97 నియోజకవర్గాల్లో 226రోజులు 3,132 కిలో మీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది. ప్రతి జిల్లాలోనూ లోకేశ్ యువగళం పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇవాళ విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద యువగళం యాత్ర ముగియనుంది.
Also Read : Nara Lokesh : జగన్ అరాచక పాలనకు మూడు నెలల్లో ముగింపు : నారా లోకేష్
ఉమ్మడి జిల్లాల వారీగా..
- చిత్తూరులో 14 నియోజకవర్గాల్లో 45రోజుల పాటు 577 కిలో మీటర్లు యువగళం
పాదయాత్ర సాగింది. - అనంతపురం జిల్లాల్లో 9 నియోజకవర్గాల్లో 23రోజుల పాటు 303 కిలో మీటర్ల మేర యాత్ర సాగింది.
- కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 40రోజుల పాటు 507 కిలో మీటర్లుమేర పాదయాత్ర సాగింది.
- కడప జిల్లాలో 7 నియోజకవర్గాలు 16రోజులుపాటు 200 కిలో మీటర్ల మేర యాత్ర సాగింది.
- నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 31రోజులుపాటు 459 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగింది.
- ప్రకాశం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో 17రోజులపాటు 220 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.
- గుంటూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో 16రోజులుపాటు 236 కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర సాగింది.
- కృష్ణా జిల్లాలో 6 నియోజకవర్గాల్లో 8రోజులుపాటు 113 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది.
- పశ్చిమగోదావరి జిల్లాలో 8 నియోజకవర్గాలు 11రోజులుపాటు 225.5 కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర సాగింది.
- తూర్పుగోదావరి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 12రోజులుపాటు 178.5 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది.
- విశాఖపట్నం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 7రోజులుపాటు 113 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.
Also Read : Chandrababu Naidu : చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే
అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు లోకేశ్ ..
గత 11ఏళ్ల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రను చేపట్టారు. అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపురంలో చంద్రబాబు యాత్ర ప్రారంభించారు. 208 రోజుల పాటు యాత్ర సాగింది. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,817 కిలో మీటర్లు చంద్రబాబు పాదయాత్ర చేశారు. 2013 ఏప్రిల్ 28న విశాఖలోని అగనంపూడి వద్ద పాదయాత్ర ముగిసింది. అప్పట్లో ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ పాదయాత్రగా నిలిచింది. ఆ తరువాత 2014లో చంద్రబాబు నాయుడు ఏపీలో అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కూడా విశాఖలోని అగనంపూడిలోనే ముగియనుంది. లోకేశ్ పాదయాత్ర కూడా సుదీర్ఘంగా సాగింది. అప్పట్లో వస్తున్నా మీకోసం తరువాత టీడీపీ అధికారంలోకి వచ్చింది.. ఇప్పుడు కూడా లోకేశ్ పాదయాత్ర తరువాత వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాసమస్యల పరిష్కారం కోసం వేలాది మందితో కలిసి నారా లోకేష్ ప్రారంభించిన పాదయత్ర దిగ్విజయంగా 3100 కిలోమీటర్ల పూర్తి.#YuvaGalamPadayatra #YuvaGalam #NaraLokesh #TDP pic.twitter.com/E8BHMrLNaI
— YuvaGalam (@yuvagalam) December 16, 2023