Nara Lokesh : సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
పోలవరం నిర్వాసితుల హామీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ లేఖ రాశారు. జగన్ హామీలకు సంబంధించిన ఓ వీడియోను లోకేష్ ఆ లేఖకు జత చేశారు.

Lokesh
Nara Lokesh letter CM Jagan : పోలవరం నిర్వాసితుల హామీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ లేఖ రాశారు. జగన్ హామీలకు సంబంధించిన ఓ వీడియోను లోకేష్ ఆ లేఖకు జత చేశారు. పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ.19లక్షలు చెల్లిస్తానని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మాట తప్పనని చేసుకునే ప్రచారానికి కట్టుబడి పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
275 ప్రభావిత గ్రామాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి, కేవలం 9గ్రామాల్లో మాత్రమే అరకొరగా పరిహారం అందచేశారని విమర్శించారు. వరదల్లో నిండామునిగిన నిర్వాసితులకు ఒక కొవ్వొత్తి, 2 బంగాళాదుంపలు ఇచ్చి అమానవీయంగా వ్యవహరించారని పేర్కొన్నారు. నిర్వాసితులది చిన్న సమస్యే అంటున్న మంత్రులు ఆ దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయకపోవటం విచారకరమని తెలిపారు.
Poonam Kaur: ప్రకాష్ రాజ్ గెలిస్తే నా సమస్యలు బయటపెడతా.. పూనమ్ ట్వీట్!
ఉండేదుకు ఇళ్లు, తాగేందుకు నీళ్లు, విద్యుత్ సౌకర్యం వంటివి లేక నిర్వాసితులు సమస్యలతో సావాసం చేస్తుంటే ప్రభుత్వంలో స్పందన లేదని విమర్శించారు. పునరావాస కల్పనలో ప్రభుత్వం విఫలమైందని జాతీయ ఎస్టీ కమిషన్ ఆక్షేపించినా ప్రభుత్వంలో స్పందన లేదన్నారు.