టీడీపీ నేతల బైకులు దగ్ధం : చంద్రగిరిలో టెన్షన్

చంద్రగిరిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తుమ్మలగుంటలో టీడీపీ నేతలకు చెందిన రెండు బైకులను దగ్ధం చేశారు.

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 11:13 AM IST
టీడీపీ నేతల బైకులు దగ్ధం : చంద్రగిరిలో టెన్షన్

Updated On : April 12, 2019 / 11:13 AM IST

చంద్రగిరిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తుమ్మలగుంటలో టీడీపీ నేతలకు చెందిన రెండు బైకులను దగ్ధం చేశారు.

చంద్రగిరిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తుమ్మలగుంటలో టీడీపీ నేతలకు చెందిన రెండు బైకులను దగ్ధం చేశారు. ఈ ఘటనపై టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తుమ్మలగుంటలో తన భార్యపై దాడి చేసేందుకు యత్నించారని నాని ఆరోపించారు. చెవిరెడ్డి, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
Read Also : చంద్రుడిపై కూలిన ఇజ్రాయెల్ అంతరిక్ష నౌక  

పోలింగ్ సందర్భంగా జరిగిన వరుస ఘటనలతో చంద్రగిరి నియోజకవర్గం అట్టుడికిపోయింది. అనేక చోట్ల పెద్ద ఎత్తున అల్లర్లు, గొడవలు చెలరేగాయి. ఆ వివాదం ఇప్పటికీ చల్లారలేదు. తుమ్మలగుంటలో పోలింగ్ సమయంలో ఘర్షణ జరిగినప్పుడు టీడీపీ కార్యకర్తలు రెండు బైకులను అక్కడే వదిలి వెళ్లారు. ఆ రెండు బైక్ లను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. వైసీపీ నేతలే తమ బైకులను కాల్చివేశారని టీడీపీ కార్యకర్తులు ఆరోపిస్తున్నారు.
Read Also : అమ్మో.. బాంబు తుపాన్.. అమెరికా గజగజ