Nara Lokesh : లోకేశ్ పాదయాత్రలో ఒక్కసారిగా కలకలం.. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి, పట్టుకున్న టీడీపీ నేతలు

కనిగిరి మండలం పెద్ద అలవలపాడు క్యాంప్ సైట్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న టీమ్ సభ్యుడిని టీడీపీ నేతలు గుర్తించి పట్టుకున్నారు. (Nara Lokesh)

Nara Lokesh : లోకేశ్ పాదయాత్రలో ఒక్కసారిగా కలకలం.. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి, పట్టుకున్న టీడీపీ నేతలు

Nara Lokesh

Updated On : July 19, 2023 / 7:41 PM IST

Nara Lokesh – IPAC Member : టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రలో ఐప్యాక్ బృందం సభ్యులు కలకలం సృష్టిస్తున్నారు. వైసీపీకి రాజకీయ వ్యూహ రచన చేస్తున్న ఈ బృందం సభ్యులు లోకేశ్ పాదయాత్రకు హాజరవుతూ ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది.

Also Read..Roja Selvamani : పార్టీ పెట్టింది గాడిదలు కాయడానికా? నీలాంటి వ్యక్తికి ఎవరైనా ఓటువేస్తారా? పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డ మంత్రి రోజా

కనిగిరి మండలం పెద్ద అలవలపాడు క్యాంప్ సైట్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐప్యాక్ టీమ్ సభ్యుడిని టీడీపీ నేతలు గుర్తించి పట్టుకున్నారు. లోకేశ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఐప్యాక్ సంస్థకు చేరవేస్తున్నట్లుగా గుర్తించారు. లోకేశ్ పాదయాత్ర సమాచారాన్ని చేరవేస్తున్న ముగ్గురు ఐప్యాక్ సభ్యుల్లో ఒకరిని పట్టుకున్నారు.

కాగా, ఐప్యాక్ పై ఇప్పటికే టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలందరి వ్యక్తిగత సమాచారం ఐప్యాక్‌ గుప్పిట్లో ఉందని, ఇది మంచి పరిణామం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తికి సంబంధించిన అన్ని రకాల వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించి ఐప్యాక్‌ చేతిలో పెట్టారని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఓటర్ల సమాచారాన్ని ఐప్యాక్‌కు అప్పగించి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో ఇష్టమొచ్చినట్లు మార్పులు చేర్పులు చేస్తున్నారని చెప్పారు.

కుప్పం మున్సిపల్‌ ఎన్నికలు, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఇదే పద్ధతిని అనుసరించారని టీడీపీ నేతలు అంటున్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధానంతో ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. వెంటనే ఈ వ్యవహారంలో కేంద్రం, ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలన్నారు. డేటా చౌర్యంపై గతంలో జగన్‌ చేసిన కామెంట్స్ వీడియోను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

Also Read..Pilli Bose: వైసీపీలో కంగారు పుట్టించిన రామచంద్రాపురం రాజకీయం.. సీఎంతో సహా ముగ్గురితో బోస్ భేటీ..