Gadde Ramamohan: కేశినేని నాని విశ్వరూపం చూపిస్తే.. మేము కూడా చూస్తాం..
ఇద్దరం సహకరించుకోవడం వల్లే గెలిచాను. ఆ బోనస్ నా ఒక్కడికే కేశినేని నాని ఎందుకు ఇచ్చారు? మిగిలిన ఆరుగురిని కూడా ఎందుకు గెలిపించలేదు?

TDP MLA Gadde Ramamohan Rao counter to Kesineni Nani
Gadde Ramamohan Rao: ఎంపీ కేశినేని నాని తనపై చేసిన వ్యాఖ్యలపై విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ రావు స్పందించారు. కేశినేని నాని విశ్వరూపం చూపిస్తే తాము కూడా చూస్తామంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేశినేని నానికి తనపై అంత నమ్మకం ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలని సూచించారు. తన వల్లే విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ రావు గెలిచారని గురువారం కేశినేని నాని వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా రామ్మోహన్ రావు స్పందించారు.
ఆ బోనస్ నా ఒక్కడికే ఎందుకు?
”2019 నుంచి నాకు పోటీ చేయడం ఇష్టం లేదని కేశినేని నాని పలు మార్లు చెప్పారు. ఈ మాట మా అందరు నాయకుల సమక్షంలో చంద్రబాబుతో చాలాసార్లు చెప్పారు. మరి ఏ హక్కుతో ఇప్పుడు చంద్రబాబును మాట్లాడుతున్నారు? రాష్ట్ర యువత సర్వనాశనం అవుతోంది. పేపర్ చూస్తే పీకలు కోసే సంఘటనలే కనబడనతున్నాయి. రాష్ట్రాన్ని కాపాడేందుకు చంద్రబాబు ముందుకు వెడుతున్నారు. కేశినేని నాని వల్లే నేను గెలిచాను. ఇద్దరం సహకరించుకోవడం వల్లే గెలిచాను. ఆ బోనస్ నా ఒక్కడికే కేశినేని నాని ఎందుకు ఇచ్చారు? మిగిలిన ఆరుగురిని కూడా ఎందుకు గెలిపించలేదు?
ఎంపీగా కేశినేని నాని 7 వేల మెజారిటీతో గెలిచారు. ఇండిపెండెంటుగా నిలబడి వుంటే 3 లక్షల మెజారిటీతో గెలిచేవాడినని అనేవారు. ఇప్పుడు కేశినేని నాని ఇండిపెండెంట్ గా నిలబడి గెలవచ్చుకదా. జగన్ పార్టీతో కలిస్తే ఓట్ల పర్సెంట్ తగ్గుతుంది. ఇండిపెండెంట్ గా నిలబడితే గెలుస్తావు. కేశినేని నాని ఇప్పుడు ఇండీపెండెంట్ గా నిలబడి నీ విశ్వరూపం చూపించు. కేశినేని నీ మీద గౌరవంతో సలహా ఇస్తున్నా. జగన్ పార్టీ గుర్తుతో పోటీ చేసేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. జగన్ గుర్తుకు వచ్చి కేశినేని నానికి ఓటు వేయాలనుకొనేవారు కూడా వేయరు. గద్దె రామ్మోహన్ కు ఏకలవ్య శిష్యునని కేశినేని నాని చెప్పేవారు. ఇప్పుడు నన్ను జీరో అంటున్నారు. ప్రముఖులు పుట్టిన జిల్లా, రాజకీయ ప్రముఖులు పుట్టిన జిల్లా ఇది. హుందాగా వ్యవహరించాలి. జగన్ వద్ద నీ పరిస్థితి ఏమిటి? నేను ఎగతాళిగా మాట్లాడలేదు. కృష్ణడు విశ్వరూపం చూపిస్తే కళ్లులేని వారు కూడా చూశారంట. కేశినేని విశ్వరూపం చూపిస్తే మేము కూడా చూస్తామ”ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Also Read: ప్రకాశం జిల్లా వైసీపీలో ప్లెక్సీల వార్.. మరోసారి అలిగి హైదరాబాద్ వెళ్లిపోయిన బాలినేని
నాని స్థాయి తెలుసుకుని మాట్లాడాలి: చిన్ని
కేశినేని నానికి రాజకీయం అంటే ఏంటో తెలవక ముందే గద్దె రామ్మోహన్ ఎంపీ అయ్యారని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు. గద్దె రామ్మోహన్ స్థాయి తెలుసుకుని నాని మాట్లాడితే మంచిదని సలహాయిచ్చారు. ”కేశినేని నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. సైక్రియార్టిస్టుకు చూపించుకోవాలి. కేశినేని నానితో సహా సైకోలందరూ ఒక పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు సీట్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదు. సైకో పార్టీలో ఉన్న వారంతా చంద్రబాబు నాయుడుని విమర్శించటమే పనిగా పెట్టుకున్నార”ని మండిపడ్డారు.