TDP MLC Ashok Babu: జగన్ పిల్లలకు మేనమామ కాదు.. దొంగ మామ..

మీ నాన్న వైఎస్ చంద్రబాబుని ఏమి చేయలేకపోయారు. ఇక నువు ఏమి చేస్తావ్ జగన్, నాలుగేళ్లుగా చంద్రబాబు వెంట్రుక కూడా తాకలేదు. ఇక ఈ ఏడాదిలో ఏమి చేయగలరు.

TDP MLC Ashok Babu: జగన్ పిల్లలకు మేనమామ కాదు.. దొంగ మామ..

TDP MLC Ashok Babu

Updated On : June 12, 2023 / 2:36 PM IST

Ashok Babu: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబును ఇష్టంమొచ్చినట్లు మాట్లాడితే సహించమని హెచ్చరించారు. సీఎం జగన్ చంద్రబాబును చూసి భయపడుతున్నాడు, ఆయన మొహం చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుందని అశోక్ బాబు అన్నారు. స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్లికూడా జగన్ రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.

Janasena State Office : జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ హోమం.. పార్టీ నేతలకు లేని ఆహ్వానం

14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని, చంద్రబాబుని అసభ్య పదజాలంతో దూషిస్తే అంతకుమించి మేము మాట్లాడగలమని అశోక్ బాబు హెచ్చరించారు. బాబాయ్‌ని గొడ్డలిపోటు పొడిచి చంద్రబాబుని వెన్నుపోటు అంటే ఎవరు నమ్మరనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని సూచించారు. జగన్ పిల్లలకు మేనమామ కాదు.. దొంగ మామ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

V. Srinivasa Rao : పోలవరం, నిర్వాసితుల గురించి మాట్లాడని అమిత్ షా రాష్ట్రానికి ఎందుకొచ్చినట్లు : వి.శ్రీనివాసరావు

జగన్ చరిత్ర రక్త చరిత్ర. చంద్రబాబును వెంట్రుక కూడా సీఎం జగన్ పికలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ నాన్న వైఎస్ చంద్రబాబుని ఏమి చేయలేకపోయారు. ఇక నువు ఏమి చేస్తావ్ జగన్, నాలుగేళ్లుగా చంద్రబాబు వెంట్రుక కూడా తాకలేదు. ఇక ఏడాదిలో ఏమి చేయగలరు. సీఎం జగన్ భాష మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారంటూ అశోక్ బాబు హెచ్చరించారు.