అప్పటి మంత్రుల్లో చాలామంది జైలుకి వెళ్తారు, టీచర్ల బదిలీల్లో భారీ స్కామ్ జరిగింది- వర్ల రామయ్య

జగన్ చేసిన స్కామ్ ల తో పోల్చితే ఇది పెద్దది కాదు. బొత్స హయాంలో భారీ దోపిడీ జరిగింది.

అప్పటి మంత్రుల్లో చాలామంది జైలుకి వెళ్తారు, టీచర్ల బదిలీల్లో భారీ స్కామ్ జరిగింది- వర్ల రామయ్య

Updated On : June 10, 2024 / 7:34 PM IST

Varla Ramaiah : గత వైసీపీ పాలనలో పని చేసిన మంత్రుల్లో చాలామంది జైలుకి వెళ్తారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య బాంబు పేల్చారు. అవినీతికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. వారందరిని జైలుకి పంపే వరకు పోరాటం చేస్తానన్నారు. ఇక, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు వర్ల రామయ్యా. టీచర్ల బదిలీల వ్యవహారంలో బొత్స సత్యనారాయణ భారీ అవినీతికి పాల్పడ్డారని ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చారాయన. టీచర్ల బదిలీలలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ఏసీబీని కోరారు వర్ల రామయ్య.

”మన బిడ్డలకు చదువు చెప్పి వారిని విద్యావంతులుగా, సంస్కార వంతులుగా తీర్చిదిద్దే వారు టీచర్లు. అలాంటి వారి నుంచి బదిలీ కోసం ఒక్కో టీచర్ వద్ద రూ.3 నుంచి రూ.6 లక్షలు వసూలు చేశారు. టీచర్ల బదిలీల్లో రూ.65 కోట్ల వరకు వసూలు చేశారు. జగన్ చేసిన స్కామ్ ల తో పోల్చితే ఇది పెద్దది కాదు. బొత్స హయాంలో విద్యాశాఖలో భారీ దోపిడీ జరిగింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఎవరైనా బదిలీలు చేస్తారా? నేడు టీచర్స్ అంతా లబోదిబోమంటున్నారు. బొత్స ఇంటిపై దాడి చేసేందుకు టీచర్స్ రెడీ గా ఉన్నారు. దీనిపై ఏం చేద్దాం అని ఆలోచించాం. అందుకే ఏసీబీని ఆశ్రయించాం.

టూరిజంలో కూడా ఇదే పరిస్థితి. అప్పటి మంత్రులు చాలామంది శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్తారు. మంత్రులు అవినీతి చేస్తే వారిని వదిలేదు లేదు. మీ అవినీతి బాగోతం అంతా బయటకు వస్తుంది. మిమ్మల్ని అరెస్ట్ చేసేంత వరకు పని చేస్తాను. చట్టం పరిధిలో అందరూ వ్యవహరించాలి. బొత్స అవినీతిని బయటపెడతాం” అని వర్ల రామయ్య అన్నారు.

Also Read : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..! మంత్రివర్గం కూర్పుపై చంద్రబాబు కసరత్తు.. ఉమ్మడి జిల్లాల వారిగా రేసులో ఉంది వీరే..