కొడాలి నాని సొంత ఊరిలో టీడీపీ మద్దతుదారు విజయం

కొడాలి నాని సొంత ఊరిలో టీడీపీ మద్దతుదారు విజయం

Updated On : February 14, 2021 / 7:32 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటూ ఉండగా.. మంత్రి కొడాలి నానికి సొంత ఊరిలోనే షాక్ ఇచ్చింది టీడీపీ. మంత్రి కొడాలి నాని సొంత ఊరిలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన అనూష అనే అభ్యర్థి 200 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపొందారు.

పెదపారుపూడి మండలంలో యలమర్రు గ్రామంలో 12వ వార్డులకు గాను 11వ వార్డులు టిడిపి అభ్యర్థులు కైవసం చేసుకోగా కేవలం ఒకే ఒక్క వార్డులో వైసీపీ విజయం సాధించింది. మరో పక్క మంత్రి కొడాలి నాని ఏపీ హైకోర్టుని ఆశ్రయించనున్నారు. ఈ నెల 21న పంచాయితీ ఎన్నికలు ముగిసే వరకు మీడియాతో మాట్లాడవద్దన్న ఎస్ఈసీ ఆదేశాలు సవాలు చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కోడాలి నానీ.

ఈ పిటీషన్‌పై రేపు విచారణ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మంత్రిపై కేసులు నమోదు చేయాలన్న sec ఆదేశాలపై మరో పిటిషన్ కూడా కొడాలి నాని వేయనున్నారు.