Indrakiladri : ఇంద్రకీలాద్రిపై వైభవంగా పవిత్రోత్సవాలు
అనంతరం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను దుర్గగుడి అధికారులు అనుమతిస్తారు. సెప్టెంబరు 1వ తేదీన ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

Vijayawada Indrakiladri
Vijayawada Indrakiladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి (బుధవారం) నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. తెల్లవారుజామున 3గంటలకు అమ్మవారికి సుప్రభాతం, స్నానాభిషేకం ఉంటుంది.
అనంతరం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను దుర్గగుడి అధికారులు అనుమతిస్తారు. సెప్టెంబరు 1వ తేదీన ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. అమ్మవారి నిత్య కైంకర్యాలను దేవస్ధాన అర్చకులు నిర్వహించనున్నారు.