Inter-Caste Marriage : కులాంతర వివాహం.. పెళ్లి దుస్తులతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ప్రేమజంట

చిత్తూరు జిల్లా తమ్మినపట్నంకు చెందిన ప్రశాంత్‌, ఖమ్మం జిల్లాకు చెందిన స్పందన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్నారు.

Inter-Caste Marriage : కులాంతర వివాహం.. పెళ్లి దుస్తులతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ప్రేమజంట

Love Marrage

Updated On : June 2, 2022 / 5:35 PM IST

Inter-Caste Marriage :  వారు నవ వధూవరులు. పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దల ఆశీర్వాదం కోసం వెళ్లకుండా నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. పెళ్లి దుస్తులతో స్టేషన్‌కు వచ్చిన జంటను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. తమకు రక్షణ కల్పించాలని వధూవరులు కోరడంలో అసలు విషయం అర్థమైంది.

Inter Caste Marriage : కులాంతర వివాహం చేసుకుని ఆరు నెలల తర్వాత ఇంటికెళ్తే…

చిత్తూరు జిల్లా తమ్మినపట్నంకు చెందిన ప్రశాంత్‌, ఖమ్మం జిల్లాకు చెందిన స్పందన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్నారు. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చిల్లకూరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కల్పించాలని కోరారు.