Inter Caste Marriage : కులాంతర వివాహం చేసుకుని ఆరు నెలల తర్వాత ఇంటికెళ్తే…

అత్యాధునికాలంలోనూ కులాంతర వివాహాలను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. కులాంతర వివాహం చేసుకుని ఆరు నెలల తర్వాత ఇంటికి వెళ్లిన జంటకు గ్రామ పెద్దలు భారీ జరిమానా విధించారు.

Inter Caste Marriage : కులాంతర వివాహం చేసుకుని ఆరు నెలల తర్వాత ఇంటికెళ్తే…

Inter Caste Marriage

Inter Caste Marriage : అత్యాధునికాలంలోనూ కులాంతర వివాహాలను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. కులాంతర వివాహం చేసుకుని ఆరు నెలల తర్వాత ఇంటికి వెళ్లిన జంటకు గ్రామ పెద్దలు భారీ జరిమానా విధించారు. పోలీసుల కథనం ప్రకారం..ఒడిశాలోని కియోంఝర్‌ జిల్లా నియలిజరాన్ కు చెందిన గిరిజన యువకుడు మహేశ్వర్ బాస్కే అదే గ్రామంలో వేరే కులానికి చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహాన్ని గ్రామ పెద్దలు, గ్రామస్తులు వ్యతిరేకించారు. అంతేకాకుండా చంపుతామని బెదిరించారు. దీంతో ఆ జంట గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు.

లాక్‌డౌన్‌ కారణంగా పట్టణాల్లో పనులు లేక ఆ జంట తిరిగి అదే గ్రామానికి రావడంతో గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టారు. కులాంతర వివాహం చేసుకొని తప్పు చేసినందుకు గానూ రూ.25 లక్షల భారీ జరిమానా కట్టాలని తీర్పు ఇచ్చారు. అంతేకాక జరిమానా చెల్లించే వరకు వారికి ఎవరూ సహాయం చేయకూడదని, కనీసం నీళ్లు కూడా ఇవ్వకూడదని గ్రామస్తులకు షరతు విధించారు. దీంతో అంత పెద్ద మొత్తంలో జరిమానా కట్టలేక ఆ జంట పోలీసులను ఆశ్రయించింది.

ప్రస్తుతం తన భార్య, తల్లితో కలిసి ఊరు బయట ఉన్న తన మేనమామ ఇంట్లో ఉంటున్నామని మహేశ్వర్ తెలిపారు. అంత పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించలేమని పేర్కొన్నారు. తమని గ్రామంలోకి అనుమతించడానికి సాయం చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ విషయంపై ఆనంద్ పూర్ కోర్టు దర్యాప్తుకు ఆదేశించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.