Prakasam : ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కేబినెట్‌లో దక్కని చోటు
అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. చివరి వరకు ఆదిమూలపు సురేశ్ పేరు వినిపించినా.. ఆయనకు పదవి దక్కలేదు. బాలినేని అలక, అసంతృప్తితో సమీకరణం మారింది.

Jagan 2.03
joint prakasam district : ఏపీ కొత్త మంత్రివర్గ జాబితా విడుదల రిలీజ్ అయింది. 25 మందితో మంత్రుల జాబితా విడుదల చేశారు. 10 మంది పాత మంత్రులు, 15 మంది కొత్త వారితో కొత్త కేబినెట్ కూర్పు చేశారు. బొత్స సత్యానారాయణ, ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, పి. రాజన్నదొరకు చోటు దక్కింది. గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, జొన్నలగడ్డ పద్మావతికు కేబినెట్ బెర్త్ కన్‌ఫామ్ అయింది.
జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాణి, అంజాద్ బాషా, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, పెద్దిరెడ్డి, నారాయణస్వామి, రోజా, ఉషశ్రీ, చరణ్, తిప్పేస్వామి, కామూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాల్ లకు మంత్రి పదవులు దక్కాయి.
AP New Cabinet : ఏపీ నూతన కేబినెట్ జాబితా విడుదల.. కొత్త మంత్రులు వీరే
అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. చివరి వరకు ఆదిమూలపు సురేశ్ పేరు వినిపించినా.. ఆయనకు పదవి దక్కలేదు. బాలినేని అలక, అసంతృప్తితో సమీకరణం మారింది. బాలినేనితో పాటు ఆదిమూలపు సురేశ్‌ను కూడా జగన్ పక్కన పెట్టారు. కేబినెట్ లో కొనసాగిస్తే ఇద్దరిని కొనసాగించాలి లేని పక్షంలో ఇద్దరిని కూడా తొలగించాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఒకవేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్ ను కొనసాగించి..తనను తీసేస్తే జిల్లాలో పరిస్థితులు దారుణంగా, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పారు. తాను కూడా పార్టీలో కొనసాగే పరిస్థితి ఉండదంటూ బాలినేని ముందు నుంచి కూడా చెబుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఆయన ఇదే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న బాలినేని దగ్గరకు సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే, మొత్తానికి బాలినేని పంతం నెగ్గించుకున్నారనే చెప్పాలి.
Governor : ఏపీ మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్
ప్రకాశం జిల్లాలో మంత్రి ప్రాధాన్యత అనేది లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న ఇద్దరు మంత్రులను సీఎం జగన్ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆదిమూలుపు సురేష్ ను కూడా సీఎం జగన్ పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్త కేబినెట్‌లో సామాజిక సమీకరణాలు మారాయి. రెడ్డి సామాజిక వర్గం తర్వాత వైశ్య, క్షత్రియ, కమ్మ, బ్రాహ్మణ వర్గాలకు కొత్త కేబినెట్ చోటు దక్కలేదు.