క్రషర్ మిల్లు సిబ్బందిపై దుండగుల దాడి…నలుగురికి కాళ్లు చేతులు విరిగిపోయాయి

Thugs attack Lakshmi Crusher Mill : అనంతపురం జిల్లా రాయదుర్గంలోని లక్ష్మీ క్రషర్ మిల్లులో దుండగులు బీభత్సం సృష్టించారు. క్రషర్ ఆఫీస్‌పై దాడి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. క్రషర్ సిబ్బందిని విచక్షణా రహితంగా కొట్టారు. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి, నలుగురికి కాళ్లు చేతులు విరిగిపోయాయి. గాయపడ్డవారిని బళ్లారి ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
అటు తమ క్రషర్ కంపెనీపై రాయదుర్గం ఎమ్మెల్యే అనుచరులే దాడి చేశారని లక్ష్మి క్రషర్ యజమాని అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 50 మందిపై కంప్లయింట్ ఇచ్చారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.