Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్డు మూసివేత.. తృటిలో తప్పిన ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్!

తిరుమలలో వర్షాలు తగ్గుముఖం పట్టినా.. భారీగా కురిసిన వర్షాల కారణమో.. ఏమో కానీ, కొండచరియలు విరిగి రోడ్డు మీద పడుతున్నాయి.

Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్డు మూసివేత.. తృటిలో తప్పిన ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్!

Tirumala

Updated On : December 1, 2021 / 8:04 AM IST

Tirumala ghat: తిరుమలలో వర్షాలు తగ్గుముఖం పట్టినా.. భారీగా కురిసిన వర్షాల కారణమో.. ఏమో కానీ, కొండచరియలు విరిగి రోడ్డు మీద పడుతున్నాయి. పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డు మీద పడడంతో రోడ్లు పగిలిపోతున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా రెండవ ఘాట్ రోడ్డు 4,5 కిలోమీటర్ల మధ్య కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద భారీగా చీలికలు ఏర్పడ్డాయి. భాష్యకార్ల సన్నిధికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రోడ్డుపై రాళ్లు ఉండడం.. కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు టీటీడీ అధికారులు. టీటీడీ అత్యవసర సిబ్బంది చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కొండచరియలు తొలగించే పనిలో టీటీడీ విజిలెన్స్, ఇంజనీరింగ్, అటవీశాఖ అధికారులు ఉన్నారు. రెండవ ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు.

రెండు ఘాట్‌ రోడ్లలోనూ చాలాచోట్ల కొండచరియలు విరిగిపడుతూ ఉన్నాయి. దీంతో వాహనాలను నిలిపివేయగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీ ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టింది. అయితే, ఘాట్ రోడ్డు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దగ్గరలో భక్తులతో వస్తున్న బస్సు కూడా ఉన్న సమయంలోనే కొండచరియలు విరిగిపడ్డాయి. ఆరు కిలోమీటర్ల మేర తిరుమల రెండో ఘాట్ లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అక్కడకి మీడియాను సైతం అనుమతించట్లేదు అధికారులు.