Tirumala : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. నేడు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న స్వామి వారు
మూడు లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. డీఐజీ అమ్మిరెడ్డి, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, టీటీడీ సీవీఎస్ఓ నరసింహ కిషోర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Tirumala Srivari Brahmotsavam
Tirumala Srivari Brahmotsavam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేడు ఐదవ రోజు జరుగనున్నాయి. గరుడ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 గంటలకు గరుడసేవ (Garuda Seva) ప్రారంభం కానుంది.
అర్ధరాత్రి 2 గంటల వరకు గరుడసేవ జరగనుంది. మూడు లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. డీఐజీ అమ్మిరెడ్డి, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, టీటీడీ సీవీఎస్ఓ నరసింహ కిషోర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Tirumala: అలా చేయొద్దు.. తిరుమల కొండపైకి నడక మార్గంలో ప్రయాణించే భక్తులకు టీటీడీ కీలక సూచన..
4800 మంది పోలీసులు, 1130 టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 2770 సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షణ చేస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్లలో రేపు ఉదయం 6గంటల వరకు ద్విచక్ర వాహనాలు నిలిపివేశారు.