సెప్టెంబర్ లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

సెప్టెంబర్ నెలలో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగునున్నాయి. 19వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై, 27న శ్రీవారి చక్ర స్నానం, ధ్వజావరోహణంతో ముగుస్తాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెలలో జరిగే విశేష పర్వదినాలను టీటీడీ విడుదల చేసింది.
https://10tv.in/telugu-states-colleges-will-starts-from-september/
–సెప్టెంబరు 1న అనంత పద్మనాభ వ్రతం
– సెప్టెంబరు 17న మహాలయ అమావాస్య.
– సెప్టెంబరు 18న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
– సెప్టెంబరు 19న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
– సెప్టెంబరు 23న శ్రీవారి గరుడసేవ.
– సెప్టెంబరు 24న శ్రీవారి స్వర్ణరథోత్సవం.
– సెప్టెంబరు 26న రథోత్సవం.
– సెప్టెంబరు 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమాప్తి.
– సెప్టెంబరు 28న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం.