TTD : తిరుమలలో ఎవ్వరికైనా స్వామి వారి అన్నప్రసాదమే.. ప్రైవేటు హోటల్స్ బంద్

సిఫార్సు లేఖపై ఇచ్చే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే.. ధరలు ఏ మేరకు పెంచుతారు అన్నది టీటీడీ చైర్మన్ వెల్లడించలేదు...

TTD : తిరుమలలో ఎవ్వరికైనా స్వామి వారి అన్నప్రసాదమే.. ప్రైవేటు హోటల్స్ బంద్

Ttd News

Updated On : February 17, 2022 / 5:11 PM IST

Tirumala Tirupati Board Meeting : తిరుపతికి వచ్చే వారు ఎవరైనా సరే అందరికీ ఒకేరకమైన భోజనం అందించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. భక్తులందరికీ శ్రీవారి అన్న ప్రసాదం అందించేందుకు బోర్డు నిర్ణయించిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఇందుకు కొండపై ఉన్న ప్రైవేటు హోటల్స్ లను తొలగిస్తామని, ఈ నెలాఖరులోగా తిరుమలలో సాధారణ పరిస్థితులు తెస్తామని తెలిపారు. 2022, ఫిబ్రవరి 17వ తేదీ గురువారం తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాల క్రితం నిలిపివేసిన ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని, ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై రెండు రోజుల్లో ప్రకటన చేస్తామన్నారు. సిఫార్సు లేఖపై ఇచ్చే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే.. ధరలు ఏ మేరకు పెంచుతారు అన్నది టీటీడీ చైర్మన్ వెల్లడించలేదు.

Read More : TTD : తిరుమల కొండపై ప్రైవేటు హోటళ్లు తొలగించాలని నిర్ణయం

కొండపైన అన్ని చోట్లా అన్న ప్రసాదం అందించాలని నిర్ణయం.
అన్న ప్రసాద భవనంలో ఆహారం తయారీకి సోలార్ ప్లాంట్ ఏర్పాటు.
త్వరలోనే అన్నమయ్య మార్గం ఏర్పాటు.
అటవీశాఖ అనుమతి వచ్చేలోగా తాత్కాలిక పనులు చేపట్టాలని నిర్ణయం.

Read More : TTD: ఆర్జిత సేవ టికెట్ల ధరలు భారీగా పెంచిన టీటీడీ!

ప్రస్తుతం నడక దారిన వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు.
తిరుపతిలో 50 ఎకరాల్లో ఆధ్మాత్మిక నగరం ఏర్పాటుకు నిర్ణయం
మహాద్వారం, బంగారు వాకిలి, ఆనందనిలయానికి బంగారు తాపడం.

Read More : Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త: 5 రోజుల పాటు స్పర్శ దర్శనం

రూ. 230 కోట్లతో పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం.
రూ. 2.73 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రి ఆధునీకరణ.
టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలకు రూ.25 కోట్లు.