Tirupati RTC : వారిని మాత్రమే బస్సుల్లో కొండపైకి తీసుకెళ్తాం.. తిరుపతి ఆర్టీసీ వివాదాస్పద నిర్ణయం
తిరుపతి ఆర్టీసీ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశికి 10 రోజుల పాటు దర్శన టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే కొండపైకి అనుమతించాలని నిర్ణయించింది.

Tirupati RTC : తిరుపతి ఆర్టీసీ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశికి 10 రోజుల పాటు దర్శన టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే కొండపైకి అనుమతించాలని నిర్ణయించింది. ఆర్టీసీ నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శనానికి, బస్సులో ప్రయాణానికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం వివాదానికి దారితీసింది.
తిరుపతి ఆర్టీసీ నిర్ణయం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి.. ఆర్టీసీకి, వైకుంఠ ద్వార ప్రవేశానికి సంబంధం లేదు. అయితే, ఆర్టీసీ అనూహ్యంగా ఒక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వారం తెరిచి ఉంచే ఈ పది రోజుల పాటు దర్శనం టికెట్లు కలిగున్న భక్తులను మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి అనుమతిస్తామని చెబుతూ ఆర్టీసీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.
నిజానికి ఇది చాలా వివాదాస్పద నిర్ణయం. ఒకవేళ టీటీడీ నుంచి అలాంటి ఒక విజ్ఞప్తి వచ్చి ఉన్నా ఆర్టీసీ అధికారులు దాన్ని తిరస్కరించ ఉండవచ్చు. ఎందుకంటే, భక్తులు శ్రీవారి దర్శనం కోసం కొండపైకి వస్తారు. స్వామి వారి దర్శనం లభించకపోయినా.. ఆనంద నిలయాన్నో, వైకుంఠ ద్వారం బయటనో, లేదా మహా ద్వారం ముందు నుంచో స్వామి వారి దర్శనం చేసుకుని వెనుదిరుగుతారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
కానీ, దర్శనం టికెట్లు ఉన్న వారికి మాత్రమే కొండపైకి అనుమతిస్తాం, దర్శన టికెట్లు ఉన్న వారు మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఎక్కాలి అనే నిర్ణయం వివాదానికి దారితీసింది. ఇలాంటి నిర్ణయం గతంలో ఎన్నడూ కానీ ఆర్టీసీ తీసుకోలేదు. ఆర్టీసీ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. దర్శనం టికెట్లు ఉన్న వారు మాత్రమే కొండపైకి రావాలని టీటీడీ ఇటీవల భక్తులను కోరింది. అంతవరకు సబబుగానే ఉంది. కానీ, దర్శనం టికెట్లు ఉన్న వారిని మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి తీసుకెళ్తామని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది.
Also Read..Tirumala Alert : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం