Tollywood Producer : చిత్రపరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్త వార్త మరువకముందే రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత మృతి చెందారు.

Tollywood Producer
Tollywood Producer : టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్త వార్త మరువకముందే రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత మృతి చెందారు. ‘లవ్ జర్నీ’, ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ చిత్రాలను నిర్మించిన జక్కుల నాగేశ్వరరావు (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
చదవండి : Tollywood Star’s: తెలుగు హీరోలలో పెరుగుతున్న ‘మా.. మేము’ సెంటిమెంట్!
కృష్ణా జిల్లా ఉయ్యురు మండలం మంటాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మాత నాగేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వరుసగా చిత్రపరిశ్రమకు చెందిన వారు మృతి చెందుతుండటం టాలీవుడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చదవండి : Tollywood Hero’s : టాలీవుడ్ హీరోల ఇళ్ల ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం