Actor Suman : ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మార్పులు వస్తాయి, ఆలోచించి ఓటు వేయండి- సినీ నటుడు సుమన్

రాజకీయ నాయకులను అవినీతిపరులను చేసింది ప్రజలే. ఐదేళ్లు బాగుండాలి అంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి.

Actor Suman : ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మార్పులు వస్తాయి, ఆలోచించి ఓటు వేయండి- సినీ నటుడు సుమన్

Updated On : April 1, 2024 / 4:37 PM IST

Actor Suman : రాజకీయాల్లోకి రావడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు సినీ నటుడు సుమన్. తాను సమాజ సేవలోనే ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏపీ రాజకీయాలు తనకు అవసరం లేదన్న సుమన్.. తాను తెలంగాణలో ఉంటున్నాను అని తేల్చి చెప్పారు. రాజకీయ నాయకులు దొంగలు అని ప్రజలు తిడుతున్నారని అని సుమన్ అన్నారు. అయితే, రాజకీయ నాయకులను అవినీతిపరులను చేసింది ప్రజలే అని కామెంట్ చేశారు.

అన్ని పార్టీల నాయకుల దగ్గర డబ్బులు తీసుకుని వారికి ఇష్టమైన వారికి ఓట్లు వేస్తున్నారని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చాలా మార్పులు వస్తాయని సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు బాగుండాలి అంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సుమన్ పిలుపునిచ్చారు. నేను సెక్యులరిజం ఫాలో అవుతున్నాను అని ఆయన వెల్లడించారు.

Also Read : కోలగట్ల, అదితి మధ్య టఫ్ ఫైట్.. విజయనగరంలో హైటెన్షన్ రాజకీయం