Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో విషాదం.. ఇద్దరు రాజమండ్రి మహిళలు మృతి
అమర్‌నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఈనెల 8న అమర్‌నాథ్ గుహ వద్ద సంభవించిన ఆకస్మిక వరదల్లో అనేక మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. వీరిలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుధ, పార్వతి అనే మహిళలు ఉన్నట్లు తెలిసింది. వీరి మృతిని అధికారులు ధ్రువీకరించారు.

Aamarnath Yatra
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఈనెల 8న అమర్‌నాథ్ గుహ వద్ద సంభవించిన ఆకస్మిక వరదల్లో అనేక మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. వీరిలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుధ, పార్వతి అనే మహిళలు ఉన్నట్లు తెలిసింది. వీరి మృతిని అధికారులు ధ్రువీకరించారు. సుధ మృతదేహాన్ని భర్త విజయ్ కిరణ్ గుర్తించారు. భౌతిక కాయాలను స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర నేడు మళ్లీ ప్రారంభం
ఇదిలాఉంటే అమర్ నాథ్ యాత్రకు ఆంద్రప్రదేశ్ నుంచి మొత్తం 37 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లారు. ఇందులో 24 మంది సురక్షితంగా స్వస్థలాలకు బయలుదేరారు. మరో 11 మంది ఏపీ ప్రభుత్వ అధికారులకు టచ్ లో ఉన్నారు. ఇదిలాఉంటే అమర్ నాథ్ యాత్రికుల యోగక్షేమాలను తెలుసుకుంటూ, వారిని సురక్షితంగా తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వెలగపూడి సచివాలయంలో 1902, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో 011–23384016 హెల్ప్ లైన్ నెంబర్లను సైతం అందుబాటులోకి తెచ్చారు.
Amarnath Yatra : అమర్ నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం యాత్రికులు గల్లంతు
హిమాలయాల్లో కుంభవృష్టి వర్షం కురవడంతో అమర్‌నాథ్ యాత్ర కోసం వెళ్లిన 16మంది భక్తులు వరదల్లో చిక్కుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. వరదలో దాదాపు 40మంది గల్లంతయ్యారు. వీరిలో కొందరి ఆచూకీ దొరికినప్పటికీ మరికొందరి ఆచూకీ లభ్యంకాలేదు. ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. దీంతో అనేక మంది ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డారు.