Trains Cancelled : విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు రద్దు

కోవిడ్  రైల్వే శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గటంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ నుంచి నడిచే పలు రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.

Trains Cancelled : విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు రద్దు

Trains Cancelled

Updated On : May 31, 2021 / 12:03 PM IST

Trains Cancelled : కోవిడ్  రైల్వే శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గటంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ నుంచి నడిచే పలు రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.

02743 గూడూరు – విజయవాడ రైలును జూన్‌ 2 నుంచి 16 వరకు,

విజయవాడ-గూడూరు రైలును జూన్‌ 1 నుంచి 15 వరకు,

గుంటూరు-వికారాబాద్‌,

విజయవాడ-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-విజయవాడ,

నర్సాపూర్‌-నిడదవోలు,

కాచిగూడ- గుంటూరు,

ఆదిలాబాద్‌ – హెచ్‌ఎస్‌ నాందేడ్‌,

చెన్నై సెంట్రల్‌ – విజయవాడ,

విజయవాడ – చెన్నై సెంట్రల్‌,

చెన్నై సెంట్రల్‌ – తిరుపతి,

తిరుపతి – చెన్నై సెంట్రల్‌ రైళ్లను జూన్‌ 15 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.