Kakinada Government Hospital : ఒకే బెడ్ పై ముగ్గురు కరోనా రోగులకు చికిత్స

కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఐదో వార్డులో ఒకే బెడ్ పై ముగ్గురు కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు.

Kakinada Government Hospital : ఒకే బెడ్ పై ముగ్గురు కరోనా రోగులకు చికిత్స

Kakinada Government Hospital

Updated On : May 7, 2021 / 5:21 PM IST

three corona patients on the same bed : కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఐదో వార్డులో ఒకే బెడ్ పై ముగ్గురు కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. బెడ్ పక్కన, నేలపై, కుర్చీలోనూ కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. గత్యంతరం లేక అదే వార్డులో వైద్యం చేయించుకుంటున్నామని రోగులు చెబుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ఒక్కసారిగా కోవిడ్ రోగులంతా చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. క్యాజ్వాలిటీలో గత రెండు రోజుల క్రితం 5 వ వార్డులో ఉన్న పరిస్థితులను అక్కడున్న బాధితులు కొంతమంది వీడియో తీసి బయటికి పంపించారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఒకే బెడ్ పై ముగ్గురిని పడుకోబెట్టి, అదే విధంగా పక్కన, కింద, కుర్జీలో, బల్లలపై, నేలపైన రోగులను పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలంతా కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని వైద్య ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు.