YV Subba Reddy: విజయ్ కుమార్ స్వామి వచ్చిన విమానం.. రామోజీ‌రావు బంధువు కంపెనీది ..

సీఎం జగన్‌కు ఆశీసులు ఇవ్వడానికి అనేక మంది స్వాములను తీసుకొచ్చాను. విజయ్ కుమార్ స్వామి వేరే పని‌మీద విజయవాడ వచ్చారు. ఆ విషయం నాకు తెలిసి సీఎం‌కు ఆశీసులు ఇవ్వడానికి తీసుకుని వెళ్లానని వై.వి. సుబ్బారెడ్డి అన్నారు.

YV Subba Reddy: విజయ్ కుమార్ స్వామి వచ్చిన విమానం.. రామోజీ‌రావు బంధువు కంపెనీది ..

YV Subba Reddy

Updated On : April 18, 2023 / 1:43 PM IST

YV Subba Reddy: వివేకా హత్య కేసులో అవినాష్‌ను తప్పించడానికి విజయ కుమార్ స్వామిని ఆశ్రయించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ కుమార్ స్వామి గురించి తప్పుడు ప్రచారాలు చెయ్యడం దారుణమన్నారు. విజయ్ కుమార్ స్వామి వచ్చిన ప్రత్యేక విమానం రామోజీ‌రావు బంధువు నవయుగ కంపెనీది. విజయ్ కుమార్ స్వామి అంటే నాకు ప్రత్యేక గౌరవం ఉంది. 2007 నుండి ఆయన్నినేను తరచూ కలుస్తూ ఉన్నా. నాకు అదో నమ్మకం. సీఎం జగన్‌కు అయన ఆశీసులు ఉంటే మంచిదని నా ఆలోచన.

Andhra Pradesh: షర్మిల అప్పలరాజు వ్యాఖ్యలకు ఖండనేది? అన్నాచెల్లెళ్ల డ్రామా అనుకోవాలా..

సీఎం జగన్‌కు ఆశీసులు ఇవ్వడానికి అనేక మంది స్వాములను తీసుకొచ్చాను. విజయ్ కుమార్ స్వామి వేరే పని‌మీద విజయవాడ వచ్చారు. ఆ విషయం నాకు తెలిసి సీఎం‌కు ఆశీసులు ఇవ్వడానికి తీసుకుని వెళ్ళా. రామోజీ బంధువు నవయుగ కంపెనీ విమానంలో ఎందుకు ఆయన్ను తీసుకుని వచ్చారు. మార్గదర్శి కేసు కోసమా?.. మీరు తీసుకువస్తే ఆశీసుల కోసం. మేము తీసుకుని వస్తే లాబియింగ్ కోసమా అని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. స్వామీజీలు, దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగడం మంచి పద్దతి కాదని సుబ్బారెడ్డి హితవు పలికారు.

వివేకా కేసుపై మాట్లాడుతూ..

వివేకా కేసులో విచారణ జరుగుతోంది. ఎవరూ తప్పు చేశారో కోర్టు లు నిర్ణయిస్తాయి. చట్టం తన పనితాను చేసుకుని వెళ్తుంది. పక్షపాత దోరణిలో విచారణ జరుగుతోందని కొన్ని సంఘటనల ద్వారా అనిపిస్తుంది. కొన్ని మీడియా చానల్స్‌‌లో వచ్చిన కథనాల ఆధారంగా సీబీఐ వెళ్తుందని అనుమానం ఉంది. వివేకా‌కు ఇల్లీగల్ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాల్లో విబేధాలు ఉన్నాయని ఫొటోస్ బయటకి వచ్చాయి. వివేకా కుటుంబంలో తగాదాలు ఉన్నాయి. బయట పెట్టుకుని పరువు పోగొట్టుకోకూడదు అనుకున్నాం. కానీ ఇప్పుడు బయటకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. సునీత భర్త పాత్ర‌పై విచారణ జరగాలని కోరుతున్నాం అని సుబ్బారెడ్డి అన్నారు.