TTD: టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
టీటీడీపై రాజకీయ స్వార్థపర ప్రయోజనాల కోసం కొందరు పలు ఆరోపణలు చేస్తున్నారని పాలక మండలి సమావేశంలో అధికారులు అన్నారు.

TTD
TTD – Governing Council: తిరుమల(Tirumala)లో టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి 4.17 కోట్ల రూపాయలతో టెండర్లకు ఆమోదం తెలిపారు. 2.35 కోట్ల రూపాయలతో హెచ్‌వీసీ కాటేజీల ఆధునికీకరణకు ఆమోదం చెప్పారు. తిరుమలలో 40.50 కోట్ల రూపాయలతో వేస్ట్ మేనేజమెంట్ టెండర్లకు ఆమోదం తెలిపారు.
కాగా, టీటీడీపై రాజకీయ స్వార్థపర ప్రయోజనాల కోసం కొందరు పలు ఆరోపణలు చేస్తున్నారని పాలక మండలి సమావేశంలో అధికారులు అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ పై వస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నామని తెలిపారు. దీనిపై బోర్డులో సుదీర్ఘంగా చర్చించామమని చెప్పారు. రాష్ట్రంలోని 25 జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో 2,445 ఆలయాల నిర్మాణానికి నిధులు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ విరాళాల ఖర్చుపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు.
మరిన్ని కీలక నిర్ణయాలు..
తిరుమలలో డస్ట్ బిన్ ల కోసం 3.10 కోట్ల రూపాయలతో స్టీల్ సాండ్ల ఏర్పాటుకు అమోదం
టీటీడీ కంప్యూటర్ల ఆధునికీకరణకు 7.44 కోట్ల రూపాయలు కేటాయింపు
స్విమ్స్ ఆధునికీకరణకు 1200 బెడ్స్ ఉండే విధంగా రూ.97 కోట్లతో అవసరమైన భవనాలు నిర్మించాలని నిర్ణయం
ఎయిమ్స్ తరహాలో తిరుచానూరు పుష్కరిణికి ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటుకు నిర్ణయం
ఒంటిమిట్ట లో 4 కోట్ల రూపాయలతో అన్నదాన భవనం