Srivari Darshanam Tickets : ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల

కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా టీటీడీ.. శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తోంది. అంతేకాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లను రిలీజ్‌ చేస్తుంది.

Srivari Darshanam Tickets : ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల

Srivari

Updated On : January 28, 2022 / 10:02 AM IST

TTD released Srivari Darshanam tickets : ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది. ఆన్‌లైన్‌లో 3 వందల రూపాయల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేసింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన అన్ని టికెట్లు ఇవాళే బుక్ అయ్యాయి. కొద్ది నిముషాల్లోనే టికెట్లన్నీ అయిపోయాయి. 40 నిముషాల్లోపే ఆన్ లైన్ కోటా పూర్తవడం భక్తులను నిరాశపరిచింది.

చాలా మందికి టికెట్ బుకింగ్ చేసే సమయంలో వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత.. పేమెంట్ గేట్ వే సరిగ్గా కనెక్ట్ అవక.. టికెట్లు బుక్ కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు ఎంతో నిరాశకు గురయ్యారు. అలాగే రేపు ఉదయం 9 గంటలకు టైమ్ స్లాట్ సర్వదర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. సర్వదర్శనం టోకెన్లు రోజుకు 10 వేల చొప్పున ఆన్‌‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

Fathered 129 Children : ఏకంగా 129 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు

కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా టీటీడీ.. శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తోంది. అంతేకాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లను రిలీజ్‌ చేస్తుంది. అయితే ఫిబ్రవరి నెల నుంచి శ్రీవారి దర్శన టికెట్లను పెంచుతారనే ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం కరోనా మరోసారి వేగంగా వ్యాప్తి చెందడం, కేసులు అధికంగా నమోదు కావడంతో.. ఈ నెల కూడా పరిమిత సంఖ్యలోనే టికెట్లను విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ఇప్పటికే సూచించింది. దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా 48 గంటల ముందు చేసుకున్న కోవిడ్ టెస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అధికారులకు చూపించాలి. కోవిడ్ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ లేదా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగిటివ్‌ సర్టిఫికెట్‌ను ఉన్నవారిని మాత్రమే అలిపిరి చెక్ పాయింట్ నుంచి తిరుమలకు అనుమతిస్తున్నారు.