శేషాచలం అడవుల్లో ఇద్దరు వేటగాళ్లు అరెస్ట్ : నాటు తుపాకి స్వాధీనం

  • Published By: murthy ,Published On : September 23, 2020 / 02:09 PM IST
శేషాచలం అడవుల్లో ఇద్దరు వేటగాళ్లు అరెస్ట్ : నాటు తుపాకి స్వాధీనం

Updated On : September 23, 2020 / 2:37 PM IST

AP Crime News చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో వన్యప్రాణుల ను వేటాడు తున్న ఇద్దరిని టాస్క్ ఫోర్స్  పోలీసులు అరెస్ట్ చేశారు,. వారి వద్ద నుంచి నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ కు సిబ్బందికి అడవి జంతువులను వేటాడుతున్న ఇద్దరు వేట గాళ్లు కనపడ్డారు.

వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, మందు గుండు సామగ్రి, వంట చేసుకునేందుకు అవసరమయ్యే పాత్రలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రెండు మద్యం బాటిళ్లను కూడా వారి వద్ద లభించాయి.చామల రేంజ్, వెల్లంపల్లి రిజర్వు ఫారెస్టు లో మంగళవారం రాత్రి నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టగా, బుధవారం ఉదయం వేటగాళ్లు దొరికారు.




వీరిని భాకరాపేట కు చెందిన మధు (45), ఎల్లమ్మగుడి బండ కు చెందిన రమణయ్య (48) గా గుర్తించారు. వీరి నుంచి నాటు తుపాకీ, మందు గుండు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా ఉండగా, వారిలో ఒకడి పేరు సాంబయ్య అని విచారణ లో తెలిసింది. వీరి కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. పట్టు బడిన వారిపై కేసు నమోదు చేసిన సి ఐ సుబ్రహ్మణ్యం, జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు