11ఏళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతి మచ్చ లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
11ఏళ్లుగా దేశంలోని అన్నివర్గాలకు పెద్దపీట వేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Kishan Reddy: 11ఏళ్లుగా దేశంలోని అన్నివర్గాలకు పెద్దపీట వేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని, మోదీ పాలనలో ఒక్క అవినీతి మచ్చ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ‘‘మోదీ ప్రభుత్వం 11ఏళ్ల అభివృద్ధి’పై పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు భారత్ ఆకర్షిస్తుందని అన్నారు.
Also Read: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక కామెంట్స్..
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నివర్గాలకు సంక్షేమం అందించాలనే లక్ష్యంతో మోదీ ముందుకు వెళ్తున్నారు. పేద ప్రజలు, రైతులు, మహిళలు, యువతను దృష్టిలో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. మోదీ సారథ్యంలో నేడు భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించిందని కిషన్ రెడ్డి చెప్పారు. పేదరికం నుండి దేశాన్ని మోదీ బయటకు తీసుకుని వచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా పేదలకు అన్ని చేరవేస్తున్నామని చెప్పారు. టాక్స్ లో సమగ్ర మార్పులు తీసుకుని వచ్చామని, రాష్ట్రాలకు కేంద్రం అన్నిరకాలుగా సహాయం చేస్తుందని, రాష్ట్రాలు బలపడేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
పాక్ ఉగ్రదాడులు తిప్పికొట్టామని, ఉగ్రవాదులపై బ్రహ్మాస్త్రం వదిలి భారత గౌరవాన్ని కాపాడామని, ఎక్కడా హింసను కేంద్ర ప్రభుత్వం సహించలేదని కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ పాలనలో పన్ను కట్టే వారి సంఖ్య పెరిగిందని అన్నారు. కోవిడ్ కష్టకాలంలో కూడా రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంది. ఎన్ని విమర్శలు వచ్చిన పెద్ద నోట్లను రద్దు చేశాం. భారీగా నేషనల్ హైవేస్ వేశాం. 7.7 లక్షల రూరల్ రోడ్స్ వేశాం. వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ పోర్టుల సంఖ్య పెంచాం. పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నాం. ఆడబిడ్డల గౌరవం, రక్షణ కోసం నిర్ణయాలు తీసుకున్నాం. ఆధ్యాత్మిక మార్పులు తీసుకొచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.