ఇందులో చైనా ఫస్ట్‌.. భారత్‌ సెకండ్‌.. మోదీ లక్ష్యాన్ని నెరవేర్చుతాం: విశాఖలో కుమారస్వామి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో చైనా ఫస్ట్‌.. భారత్‌ సెకండ్‌.. మోదీ లక్ష్యాన్ని నెరవేర్చుతాం: విశాఖలో కుమారస్వామి

HD Kumaraswamy

Updated On : January 30, 2025 / 6:24 PM IST

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఇవాళ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం యాజమాన్యంతో పాటు ఉద్యోగులు, కార్మికులతో సమావేశం నిర్వహించారు.

అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ… ఉక్కుశాఖ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టగానే అనేక సమీక్షలు చేశామని కుమారస్వామి చెప్పారు. ఉక్కు ఉత్పత్తిలో చైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉందని, రెండో స్థానంలో భారత్ ఉందని తెలిపారు.

అగ్రస్థానంలోకి రావాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారని కుమారస్వామి చెప్పారు. విశాఖ ఉక్కు సాధన కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని అన్నారు. 2013-14 వరకు ఉక్కు పరిశ్రమ పనితీరు బాగానే ఉందని, 2014లో నవరత్న హోదా సాధించిందని తెలిపారు. 11,000 కోట్లతో ఉత్పత్తి పెంచాలని నిర్దేశంతో నష్టాలు వచ్చాయని చెప్పారు.

Rathasapthami: తిరుమలలో ఫిబ్రవరి 4న రథ సప్తమి వేడుకలు.. తిరుపతి తొక్కిసలాట ఘటనతో టీటీడీ అలర్ట్

ఈ లక్ష్యం భారంగా మారిందని, సొంత గనులు లేకపోవడమే కారణమని కుమారస్వామి తెలిపారు. బ్యాంకుల అప్పులు భారంగా మారాయని చెప్పారు. దీంతో పెట్టుబడులు ఉపసంహరణకు కేంద్రం నిర్ణయించిందని తెలిపారు.

ఆర్ఐఎన్ఎల్‌కు రూ.35,000 కోట్ల అప్పులు ఇప్పుడు భారంగా ఉన్నాయని కుమారస్వామి చెప్పారు. జూన్‌లో వచ్చినపుడు ప్రైవేటీకరణ సరికాదని, పునరుద్ధరణ చేయాలని భావించామని వివరించారు.

చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ కలిసి ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేశారని కుమారస్వామి తెలిపారు. చివరకు ప్రధాని మోదీ అందరి విజ్ఞప్తి మేరకు ప్యాకేజీకి అంగీకరించారని చెప్పారు.

రెండు బ్లాస్ట్ ఫర్బేసస్‌లను పునరుద్ధరణ చేయాలని నిర్ణయించామని కుమారస్వామి అన్నారు. ఆర్ఐఎన్ఎల్‌ను సక్సెస్ ఫుల్‌గా నడిపేందుకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించామని తెలిపారు.

ప్యాకేజీని సమర్థంగా వినియోగించుకోవడం కోసం రోడ్ మ్యాప్‌పై కసరత్తు చేస్తున్నామని కుమారస్వామి చెప్పారు. స్టీల్ ప్లాంట్‌ను మళ్లీ నంబర్ 1గా చేయడంలో కచ్చితంగా సక్సెస్ సాధిస్తామని చెప్పారు. రెండు, మూడు నెలల్లో కార్మిక సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు.