US Girl Love Story : అమెరికా అమ్మాయి, ఆంధ్రా అబ్బాయి.. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. ప్రియుడి కోసం అమెరికా నుంచి ఏపీకి వచ్చిన యువతి
ఇన్ స్టా ద్వారా వీరిద్దరూ కనెక్ట్ అయ్యారు. తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత లవర్స్ అయ్యారు.

US Girl Love Story : ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో, ఎవరి మీద పడుతుందో తెలియదు. కానీ, ఒక్కసారి లవ్ కలిగిందంటే.. అది దూరాన్ని చూడదు, కులమతాలను, ఆస్తి అంతస్తులను చూడదు. అంతేకాదు ప్రేమకు ఎల్లలు లేవు అంటారు. ప్రేమించిన వారి కోసం సప్త సముద్రాలు కూడా దాటి వచ్చేస్తారు. దేశ విదేశాలు ఓ లెక్క కాదు. ఇది నిజమే అని మరోసారి ప్రూవ్ అయ్యింది. ప్రేమించిన యువకుడి కోసం అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామానికి వచ్చిందో యువతి. వీరి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరి మనసులు దోచుకుంది.
ఆమె పేరు జాక్లిన్ ఫోరెరో. ఉండేది అమెరికాలో. జాక్లిన్ ఫోటోగ్రాఫర్. అతడి పేరు చందన్. ఉండేది ఆంధప్రదేశ్ లోని మారుమూల గ్రామంలో. తన ప్రియుడి కోసం జాక్లిన్ అమెరికా నుంచి ఏపీలోని మారుమూల గ్రామానికి వచ్చింది. ఇన్ స్టాలో హాయ్ అనే పలకరింపుతో వీరిద్దరి మధ్య మొదలైన స్నేహం.. ప్రేమగా మారింది.. చివరికి పెళ్లి పీటల దాకా వెళ్లింది.
Also Read : సరికొత్త ఆధార్ యాప్ వచ్చేసింది.. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే..? ఇక ఆధార్ కార్డుతో పనిలేదు..
ఏపీలోని మారుమూల గ్రామానికి చెందిన చందన్ అనే యువకుడితో జాక్లిన్ లవ్ లో పడింది. చందన్ ప్రొఫైల్ చూసి జాక్లిన్ కు ఇంట్రస్ట్ కలిగింది. తొలుత తానే చందన్ కు హాయ్ చెప్పినట్లు ఆమె తెలిపింది. ఇన్ స్టాలో వీరిద్దరూ పరిచయం అయ్యారు. ఆ తర్వాత చూపులు కలిశాయి, మాటలు కలిశాయి. ముందు స్నేహితులయ్యారు, ఆ తర్వాత ప్రేమికులయ్యారు. ఇద్దరూ లవ్ లో పడ్డరారు. అలా 14 నెలలు వీరి మధ్య రొమాన్స్ నడిచింది. ఇప్పుడు తొలిసారిగా ప్రియుడు చందన్ ను చూసేందుకు జాక్లిన్ స్వయంగా అమెరికా నుంచి ఏపీకి వచ్చేసింది.
View this post on Instagram
అమెరికాకు చెందిన ఫోటోగ్రాఫర్ జాక్లిన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తాను ప్రేమించిన వ్యక్తిని కలవడానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామానికి వచ్చింది. తొలిసారి చందన్ ను కలిసిన సందర్భాన్ని వీడియోలో బంధించి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది జాక్లిన్.
View this post on Instagram
ఇన్ స్టా ద్వారా వీరిద్దరూ కనెక్ట్ అయ్యారు. తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత లవర్స్ అయ్యారు. ఇద్దరూ రోజూ వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకునే వారు. అలా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. 14 నెలల సుదీర్ఘ ప్రేమ తర్వాత, జాక్లిన్ మొదటిసారిగా చందన్ ను ముఖాముఖిగా కలవడానికి ఏపీకి వచ్చింది. వయసులో తాను చందన్ కన్నా 9 నెలలు చిన్న అని జాక్లిన్ తెలిపింది.
Also Read : నా జాతకంలో పొలిటికల్ ఎంట్రీ ఉంది.. ఆ పార్టీలోనే జాయిన్ అవుతాను..
వీరిద్దరి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందించారు. మీ ఇద్దరూ చాలా అందంగా ఉన్నారని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. మీ ఇద్దరూ ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో.. మీ కళ్లలో కనిపిస్తుంది.. అని మరొక నెటిజన్ అన్నాడు.
View this post on Instagram
”నా భర్తది కేరళ. అతడు ఢిల్లీలో ఉండేవాడు. ఆ సమయంలో నేను అతడిని కలిశాను. ఇద్దరూ ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఏడేళ్లు అవుతోంది. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అది చాలా అందమైన కథ కానీ చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఇద్దరివి వేర్వేరు సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు కావడంతో చాలా ఇబ్బంది పడ్డాం. కానీ, సెటిల్ అయ్యాక అన్నీ మర్చిపోయాం. ప్రేమ ఎంతో మధురమైనది. జీవితాంతం కలిసి ఉండాలంటే చాలా ధృడ సంకల్పం కలిగి ఉండాలి” అని ఓ మహిళ తన జీవితంలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంది.
ఈ ప్రేమ జంట తమ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని యూట్యూబ్ చానల్ లో షేర్ చేసింది. తమ మధ్య పరిచయం ఎలా మొదలైంది, స్నేహంగా ఎలా మారింది, ప్రేమకు ఎలా దారితీసింది.. అనేది ఆ వీడియోలో వివరించారు.
View this post on Instagram