Python : వామ్మో.. ఎంత పే….ద్దగా ఉందో.. బాయ్స్ హాస్టల్‌లో కొండచిలువ కలకలం
Big Python Under Bed : కొండచిలువను చూసిన విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేత పెట్టుకుని పరుగులు తీశారు.

Big Python Under Bed (Photo : Google)
చిన్న పాముని చూస్తేనే భయంతో చెమట్లు పట్టేస్తాయి. ఒళ్లంతా వణుకు పుడుతుంది. ప్రాణ భయంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. కాళ్లు చేతులు ఆడవు. అమ్మో పాము అంటూ అక్కడి నుంచి పరుగులు తీస్తాం. అలాంటిది కొండచిలువ అదీ భారీ సైజులో ఉన్నది కనిపించిందంటే.. పైప్రాణాలు పైనే పోతాయి కదూ. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది ఆ పిల్లలకు. తాము పడుకునే మంచం కింద భారీ సైజులో ఉన్న కొండచిలువను చూసి విద్యార్థులు భయంతో వణికిపోయారు.
Also Read : వణుకు పుట్టించే వీడియో.. రోడ్డుపై టపాసులు కాల్చుతున్న వారిని కారుతో గుద్దిపడేశాడు
వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో బాయ్స్ హాస్టల్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బాయ్స్ హాస్టల్ లో ఓ విద్యార్థి మంచం కింద భారీ కొండచిలువ కనిపించి కలకలం రేపింది. విద్యార్థులు సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. బాయ్స్ హాస్టల్-2లో ఓ విద్యార్థి మంచం కింద కొండచిలువ నక్కింది. కొండచిలువను చూసిన విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేత పెట్టుకుని పరుగులు తీశారు.
Also Read : బాబోయ్.. విద్యార్థి స్కూల్ షూలో పాము, తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్.. వీడియో వైరల్
వెంటనే ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరుక్షణమే హాస్టల్‌కు చేరుకున్న అటవీ సిబ్బంది కొండచిలువను సంచిలో బంధించారు. దాంతో అంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కొండచిలువను తీసుకెళ్లి అడవిలో ప్రాంతంలో వదిలేశారు అధికారులు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా రిలాక్స్ అయ్యారు. అయితే, హాస్టల్ గదిలోకి కొండచిలువ ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది? అన్నది మిస్టరీగా మారింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పిల్లలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలకు దారితీయడం ఖాయం.
#AndhraPradesh: A #python was found under a bed in the boys #hostel at #IIIT-Idupulapaya in #Kadapa district. Officials captured the #snake and released it into the #forest#reptiles #wildlife@NewIndianXpress pic.twitter.com/OscGOGhx3z
— TNIE Andhra Pradesh (@xpressandhra) November 16, 2023