చంద్రబాబు విజయవాడ ద్రోహి, స్మశానంలా చేయాలనుకున్నారు- కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
గన్నవరంలో ఎయిర్ పోర్ట్ కూడా వద్దనుకున్నారు. అమరావతిలో పెడదామనుకున్నారు. నేను, వెంకయ్య నాయుడు అడ్డంపడ్డాం.

Kesineni Nani
Kesineni Nani : టీడీపీని వీడి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 50 సీట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. తన సర్వేలలో ఈ విషయం తేలిందన్నారు కేశినేని నాని. ఆటోనగర్ లో ఎంపీ నిధులతో నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్ ను ప్రారంభించారు ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత దేవినేని అవినాష్. ఈ సందర్భంగా మాట్లాడిన నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
”లోకేశ్ ను సీఎం చేయడమే చంద్రబాబు ఎజెండా. విజయవాడకు 100 కోట్లు 2014-19 వరకు చంద్రబాబు ఇచ్చారా? విజయవాడను స్మశానంలా, హైదరాబాద్ ను బస్తీలా తయారు చేయాలనుకున్నారు. విజయవాడ అంటే చంద్రబాబుకి చిన్న చూపు. అప్పుడెప్పుడో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో విజయవాడలో ట్యాక్సీ డ్రైవర్ అవమానించారట. ఈ విషయం చాలాసార్లు మాతో చెప్పారు. గన్నవరంలో ఎయిర్ పోర్ట్ కూడా వద్దనుకున్నారు. అమరావతిలో పెడదామనుకున్నారు. నేను, వెంకయ్య నాయుడు అడ్డంపడ్డాం. నేను రాజధానికి వ్యతిరేకం కాదు. వారధి నుండి ఖాజా వరుకు ఏది కావాలంటే అది కట్టుకోండి. అది కాకుండా ఎక్కడో లోపల కడతానంటే కుదురుతుందా?
Also Read : ఎన్నికల వేళ రాజకీయాన్ని తనవైపు తిప్పుకున్న ముద్రగడ
చంద్రబాబు ల్యాండ్ మాఫియాలా ఉండకుండా ఉంటే ఇవాళ బాగా డెవలప్ అయ్యేది. ఏ రాజైన కోట కట్టాడు తప్ప నగరాన్ని నిర్మించిన రాజు చరిత్రలో లేడు. అమరావతి అంటే చంద్రబాబు అనుకోవాలి అనేది చంద్రబాబు ఉద్దేశం. బాబు, కొడుకులు ఇద్దరిదీ భూదాహంమే. చంద్రబాబు మిమ్మల్ని మోసం చేశారని అక్కడి రైతులకే చెప్పా. నేను రాజధానికి వ్యతిరేకం కాదు మళ్లీ చెబుతున్నా. విజయవాడ అభివృద్ధి బాద్యత మాది అని జగన్ మాటిచ్చారు.
చంద్రబాబు విజయవాడ ద్రోహి. సెక్రటేరియట్ లో కామన్ మ్యాన్స్ కు అంత పెద్ద పని ఏముంది? చంద్రబాబు సంగతి ఎవరికి తెలీదు. ఆ పిట్టల దొర ఏదో చెబితే నేను సమాధానం చెప్పాలా? తిరువూరు స్వామి దాస్ కు టికెట్ నేను అడగలేదు. ఆయన వైసీపీతో, జగన్ తో 6 నెలలుగా టచ్ లో ఉండి ఆయన తెచ్చుకున్నారు. ఆ టికెట్ లో నా ప్రమేయం లేదు. ఎవరి టికెట్ల విషయంలో కూడా నా ప్రమేయం ఉండదు.
Also Read : ఆ 5 స్థానాలు టీడీపీకా? జనసేనకా? తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ
”నాకు విజయవాడ అంటే పిచ్చి. ఆటోనగర్ అంటే ప్రాణం. నేను ఆటోనగర్ తీసేస్తున్నాని ప్రచారం చేశారు. వరదలతో పాటు బైపాస్ వస్తే వెహికల్స్ రావని చెప్పాను. బాండ్ లేకుండా 2 ఎకరాలు రాసిచ్చాను. దాని విలువ 100 కోట్లు. నిస్వార్దంగా చేసిన పని ఇప్పుడు ఆటోనగర్ కి ఉపయోగపడుతోంది. మా ఇద్దరి వల్ల రాబోయే రోజుల్లో అద్భుత ఫలితాలు వస్తాయి. మంచితనం వల్ల పనులు జరగవు సమర్దత వల్లే జరుగుతాయి.
ఈస్ట్ నియోజకవర్గానికి మేమిద్దరం ఒక రక్షణ. నన్ను గెలిపిస్తారు అందులో నాకు డౌట్ లేదు. ఈస్ట్, వెస్ట్ బైపాస్ లు పూర్తైతే నగరంలో లారీలు ఎలా వస్తాయి? అవినాష్ ని సీఎం జగన్ దగ్గరికి తీసుకెళ్లి మరో రెండుచోట్ల స్దలాలు అడగండి. జగన్ పేదల పెన్నిధి. నన్ను వైసీపీ ఎంపీ క్యాండెట్ గా ప్రకటించారు. అందుకు జగన్ కు ధన్యవాదాలు. ఆయనకు రుణపడి ఉంటా. నా సర్వేలలో టీడీపీకి 50 సీట్లు రావడం లేదు. ఎందుకు చెబుతున్నానో తూర్పు ప్రజలు అర్దం చేసుకోవాలి. టీడీపీలో నన్ను మెడపట్టుకొని అవమానకరీతిలో గెంటేశారు. జగన్ మాత్రం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. టికెట్ కూడా ఇచ్చారు” అని కేశినేని నాని అన్నారు.