Vijayawada Railway Station : బెజవాడ రైల్వేస్టేషన్‌కు హరిత హంగులు
విజయవాడ రైల్వేషన్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే చర్యలను రైల్వే శాఖ చేపట్టింది. హరితస్టేషన్ గా మార్చేందుకు వీలుగా తగిన అభివృద్ధిపనులకు అధికారులు శ్రీకారం చుట్టారు.

Vijayawada Railway Station
Vijayawada Railway Station : విజయవాడ రైల్వేషన్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే చర్యలను రైల్వే శాఖ చేపట్టింది. హరితస్టేషన్ గా మార్చేందుకు వీలుగా తగిన అభివృద్ధిపనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా స్టేషన్ ఫ్లాట్ ఫామ్ లపై సోలార్ పలకలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుతం 4,5ఫ్లాట్ ఫాంలపై ఈ సోలార్ పలకలు ఏర్పాటయ్యాయి. సూర్యరశ్మి ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసి, దానిని రైల్వేఫ్లాట్ మ్ లైటింగ్ తోపాటు ఇతర అవసరాలకు వినియోగించుకోనున్నారు. తద్వారా రైల్వేస్టేషన్ విద్యుత్ వినియోగపు బిల్లులను తగ్గించుకోనున్నారు.
సౌత్ సెంట్రల్ రైల్వేలో విజయవాడ స్టేషన్ ప్రాధాన్యత కలిగినది కావటం, ఇక్కడి నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ ఉండటంతో నిత్యం లక్షల మంది ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా విజయవాడ రైల్వేస్టేషన్ ను హరిత స్టేషన్ గా అత్యాధునికి హంగులతో మలిచే పనిలో రైల్వే అధికారులు నిమగ్నమయ్యారు.