నారా లోకేశ్‌తో బెజవాడ నేతల కీలక భేటీ.. కేశినేని నాని ఓటమి ఖాయం అంటూ వ్యాఖ్యలు

జగన్ ను కలిసిన 24 గంటల్లోనే కేశినేని నానికి ఎంపీ సీటు వచ్చిందంటే.. ఆ పార్టీకి కోవర్టుగా పని చేయకపోతే సాధ్యం కాదన్నారు.

నారా లోకేశ్‌తో బెజవాడ నేతల కీలక భేటీ.. కేశినేని నాని ఓటమి ఖాయం అంటూ వ్యాఖ్యలు

Vijayawada TDP Leaders Meet Nara Lokesh

Updated On : January 12, 2024 / 8:15 PM IST

Nara Lokesh : టీడీపీ నేత నారా లోకేశ్ ఇంటికి విజయవాడ టీడీపీ నేతలు వెళ్లారు. ఉండవల్లి నివాసంలో లోకేశ్ తో గన్నవరం టీడీపీ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు సమావేశం అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహారం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారని లోకేశ్ కు వివరించారు. మరోవైపు లోకేశ్ తో టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా భేటీ అయ్యారు. బెజవాడలో రాజకీయ పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేశినేని నాని వ్యవహారం చర్చకు వచ్చింది. నాని అనుచరులు బొమ్మసాని సుబ్బారావు, ఎంఎస్ బేగ్, గన్ని ప్రసాద్ సమావేశం అయ్యారు.

Also Read : చంద్రబాబు విజయవాడ ద్రోహి, స్మశానంలా చేయాలనుకున్నారు- కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్యేల రొటేషన్ విధానం ఏంటో ప్రజలకు అర్థం కావడం లేదని యార్లగడ్డ వెంకట్రావ్ చెప్పారు. రౌడీషీటర్లు, చదువు సంస్కారం లేని వారికే వైసీపీలో ప్రాధాన్యం ఉందన్నారు. చదువు లేని వారిని మంత్రులుగా చేశారని విమర్శించారు. మంత్రి పదవులు తెచ్చుకున్న వ్యక్తులు శాఖపరంగా చేసిన సమీక్ష ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారాయన.

”ఆ రోజు రాజీవ్ గాంధీ వదిలేసిన రొటేషన్ బిల్లుని ఈరోజు ఏపీలో వైసీపీ అమలు చేస్తోందని భావిస్తున్నాం. ఈ రొటేషన్లు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో కాలం నిర్ణయిస్తుంది. జగన్ పెట్టుకున్న పనికిమాలిన మంత్రుల వల్ల ఈ పరిస్థితి దాపురించింది. చదువు సంధ్య లేని వాళ్లను మాట్లాడటం రాని వారిని బూతులు తిట్టే వారిని, రౌడీషీటర్లను మంత్రులుగా పెట్టుకున్నారు” అని టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు.

Also Read : ఆ 5 స్థానాలు టీడీపీకా? జనసేనకా? తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ

ఎంపీ కేశినేని నానిపై ఫైర్ అయ్యారు టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా. జగన్ ను కలిసిన 24 గంటల్లోనే ఎంపీ సీటు వచ్చిందంటే.. ఆ పార్టీకి కోవర్టుగా పని చేయకపోతే సాధ్యం కాదన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్నీ సీట్లు వైసీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. ” పార్టీ ఉంటేనే మనం ఉంటాం. పార్టీ లేకపోతే మనం లేము అనేది కేశినేని నానికి బాగా అర్థమైంది. నాని మొన్నటివరకు జగన్ ను తిట్టారు. జగన్ ఒక నియంత, దుర్మార్గుడు, అమరావతి రాజధానికి వ్యతిరేకి. రాజధాని విశాఖకు తీసుకెళ్తామని అన్నారు అంటూ జగన్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తి.. ఒక్కరోజులోనే చాలా మంచోడు అయిపోయాడు.

విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలను సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానని కేశినేని నాని అంటున్నాడు. ఏడు నియోజకవర్గాల్లో కాదు నీతో సహా మొత్తం అన్ని చోట్ల వైసీపీ ఓడిపోనుంది. విజయవాడ పార్లమెంటు ఏడు నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది” అని టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా అన్నారు.