ఆప్తులు కాస్త ప్రత్యర్థులుగా మారి జగన్‌పై బాణాలు.. వైసీపీ అధినేత టార్గెట్‌గా ఆ ఇద్దరి విమర్శల దాడి
విజయసాయి రాజకీయాలకు రాంరాం అంటూనే వైసీపీ అధినేతను ఇరకాటంలో పెట్టేస్తున్నారు.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. ఇది చాలా పాపులర్ లైన్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిది కళ్ల ముందు కనిపిస్తున్న సత్యం కూడా. ఒకప్పుడు వైసీపీ అధినేతకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారు..ఇప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఏకంగా జగన్ టార్గెట్‌గానే విమర్శల దాడి చేస్తున్నారు.
అంతేకాదు ఆయన తమను సర్వం ముంచారని..ఫ్యూచర్‌లో అన్నీ బయటపెడుతామంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. మొన్నటి వరకు జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండి..వైసీపీలో నెంబర్ టుగా చెప్పుకోబడిన విజయసాయిరెడ్డి జగన్‌కు కంట్లో నలుసులా తయ్యారయ్యారు. లిక్కర్ స్కాం అంటూ హాట్ కామెంట్స్ చేశారు. కాకినాడ సీపోర్ట్ వాటాల వ్యవహారంపై భవిష్యత్‌లో పూర్తి వివరాలు చెప్తానంటున్నారు. ఇక జగన్ కోటరీ అంటూ బాణాలు ఎక్కుపెట్టారు.
విజయసాయిరెడ్డి కామెంట్స్‌తో రాజకీయ రచ్చ చల్లారకముందే..బాలినేని శ్రీనివాస్ ఎంటర్ అయ్యారు. జగన్ తన ఆస్తులు..తన వియ్యంకుడి ఆస్తులను కాజేశారని..జనసేన ప్లీనరీ సభ వేదికగా గళమెత్తారు. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటూ పోతే ఒక్కరోజు సరిపోదని చెప్పుకొచ్చారు. జగన్ చేసిన అన్యాయాలన్నీ త్వరలోనే చెబుతానని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు బాలినేని. సవాల్ చేస్తున్నా..అప్పటి ఎమ్మెల్యేలందరిపైనా విచారణ వేయండి..తనపై కూడా వేయండి..ఎవరు తప్పు చేశారో, ఎవరు రూ.కోట్లు సంపాదించారో తేలుతుందంటూ శివాలెత్తిపోయారు.
Also Read: యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్.. మరో కేసు నమోదు.. సజ్జనార్ ఫైర్
అటు విజయసాయిరెడ్డి..ఇటు బాలినేని..ఇద్దరు ఒకప్పుడు జగన్‌కు చాలా ఆప్తులు. విజయసాయిరెడ్డి అయితే జగన్‌కు తోడునీడుగా..16నెలల పాటు ఆయనతో పాటు జైలులో ఉండివచ్చారు. 15ఏళ్లు పార్టీలో అన్నతమ్ముళ్లలాగా కలిసి పనిచేశారు. తన కంటే ఏజ్‌లో చిన్నవాడైనా జగన్ అంటే అభిమానం చూపించేవారు.
కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ జగన్ తీరుపైనే డైరెక్టుగానే అటాక్ చేస్తున్నారు విజయసాయిరెడ్డి. కోటరీ మాటలు వినడం జగన్ చేసిన తప్పు అని నేరుగా విమర్శిస్తూనే.. వైసీపీ కీలక నేతలు ఎదుర్కొంటున్న కీలక కేసుల విషయంలో సంచలన కామెంట్స్ చేసి..ఇరకాటంలో పడేశారు.
జగన్ తన పట్ల వ్యవహరించిన తీరు బాలినేనికి నచ్చలేదా?
బాలినేని జగన్‌కు వరుసకు మామయ్య అవుతారు. వైఎస్సార్ ప్రోద్భలంతో రాజకీయాల్లోకి వచ్చారాయన. పెద్దాయన మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్‌ను వీడి జగన్ వెంట నడిచారు. అయితే అధికారంలోకి వచ్చాక జగన్ తన పట్ల వ్యవహరించిన తీరు బాలినేనికి నచ్చలేదట.
అందుకే వైసీపీలో ఉన్నప్పుడు కూడా పలుసార్లు తన అసంతృప్తిని ఓపెన్‌గానే వినిపించారాయన. మంత్రి పదవి తీసేయడం కూడా ఆయనకు మింగుడు పడలేదట. పదవి కంటే తనను అవమానించారని ఫీలయ్యారట. ఇదంతా ఇలా ఉంటే తన ఆస్తులు కూడా కొట్టేశారని ఆయన గోడు వెళ్లబోసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
విజయసాయిది సేమ్ సీన్ అంటున్నారు. జగన్ కోసం ఎంతో శ్రమిస్తే..మిగతా వారందరితో జత కట్టి తమను చిన్నచూపు చూశారని హార్ట్ అయ్యారట. ఈ బాధలన్నీ మనసులో ఉండగానే వైసీపీ పవర్‌లో నుంచి దిగిపోయింది. అంతలోనే కేసులు చుట్టేముట్టే ప్రమాదం కనిపించడంతో అలర్ట్ అయ్యారట. విజయసాయిరెడ్డి కంటే ముందుగానే బాలినేని వైసీపీని వీడి జనసేట గూటికి చేరారు.
గ్లాస్ పార్టీ శిబిరం నుంచే జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇక విజయసాయి రాజకీయాలకు రాంరాం అంటూనే వైసీపీ అధినేతను ఇరకాటంలో పెట్టేస్తున్నారు. ఇలా మొన్నటి దాకా ఆప్తమిత్రులుగా..కావాల్సినవాళ్లుగా ఉండి..ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు జగన్ మీద మాటల దాడి చేయడం అయితే ఏపీ పాలిటిక్స్‌లో ఆసక్తికరంగా మారింది.