Vijayasai Reddy: లోకేశ్ ఢిల్లీలో దాక్కున్నారు.. ఇలా మోత మోగిస్తే…: విజయసాయిరెడ్డి

లంచాలు తీసుకుని, ఇప్పుడు కంచాలు కొట్టడం ఎందుకని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Vijayasai Reddy: లోకేశ్ ఢిల్లీలో దాక్కున్నారు.. ఇలా మోత మోగిస్తే…: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy

Updated On : September 30, 2023 / 8:18 PM IST

Vijayasai Reddy: టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు వారాలుగా టీడీపీ నేత నారా లోకేశ్ ఢిల్లీలో దాక్కున్నారని చెప్పారు. ఢిల్లీలో దాక్కున్న లోకేశ్ ధైర్యవంతుడా? ఉత్తర కుమారుడా? అని అన్నారు.

టీడీపీ మోతలు మోగించడం ఎందుకని విజయసాయిరెడ్డి నిలదీశారు. లంచాలు తీసుకుని, ఇప్పుడు కంచాలు కొట్టడం ఎందుకని ఎద్దేవా చేశారు. అన్ని న్యాయస్థానాల్లోనూ చంద్రబాబు పిటిషన్లు వేశారని, అయినప్పటికీ జైల్లో ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ఎవరి కోసం హార్న్‌లు, ఎవరి కోసం విజిల్స్ వేస్తున్నారని నిలదీశారు.

రాజ్యాంగం, చట్టంపై నమ్మకం లేని అసాంఘిక శక్తులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు మారారని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ ఆందోళన ద్వారా టీడీపీ ప్రజలకు ఏమి చెప్పదలచుకుందని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ ప్రారంభం కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ లో స్కాం జరిగిందని తెలిపారు.

కాగా, దసరా నుంచి వైజాగ్ నుంచే ప్రభుత్వ పాలన ఉంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతోందని చెప్పారు.

Nara Lokesh : కొంత మంది మీడియా మిత్రులతో రోజు చిట్ చాట్ చేస్తున్నా ఎక్కడికి పారిపోలేదు : లోకేష్