Viveka Case: వివేకా హత్య కేసులో జగదీశ్వర్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ

Viveka Case: వివేకా హత్య కేసులో జగదీశ్వర్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ

Viveka Case

Updated On : June 17, 2021 / 1:35 PM IST

Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో 11వ రోజు విచారణ కొనసాగుతుంది. సీబీఐ బృందం గురువారం నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తుంది. ఈ నలుగురు వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితులని సమాచారం. పులివెందులకు చెందిన గంగాధర్, ఎర్ర గంగిరెడ్డి, సుంకేశులకు చెందిన జగదీశ్వర్ రెడ్డితోపాటు మరో మహిళను పోలీసులు విచారిస్తున్నారు.

వివేకానంద రెడ్డి హత్యకేసులో అరెస్టై కొద్దీ రోజుల క్రితం జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు గంగిరెడ్డి. ఇతడు వివేకానంద హత్య జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలు తారుమారు చేసినట్లుగా ఆరోపణలు ఎదురుకుంటున్నారు. దీంతో అతడిని గురువారం విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.

ఇక జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వివాహానంద రెడ్డి వ్యవసాయ పనులు మొత్తం ఇతడే చూసుకుంటారు. ప్రతి రోజు వివేకాను కలిసి అతడి బాగోగులు చూస్తూనేవారు. హత్య జరిగిన రోజు కూడా ఉదయం 6 గంటలకు వివేక ఇంటికి వెళ్లారనే సమాచారం ఉండటంతో సీబీఐ అధికారులు జగదీశ్వర్ రెడ్డిని విచారిస్తున్నారు.

ఇక గంగాధర్ అనే వ్యక్తి పులివెందులకు చెందిన గనుల వ్యాపారి. ఇతనితో కూడా వివేకాకు స్నేహం ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గంగాధర్ ను ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.