వైజాగ్ మెట్రోకు టెండర్లు.. ఇది ఏ రూట్‌లో వెళ్తుంది? స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయ్.. ఫుల్ డిటెయిల్స్..

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రస్తుతం తొలిదశ కింద రూ.11,498 కోట్ల విలువైన పనులకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది.

వైజాగ్ మెట్రోకు టెండర్లు.. ఇది ఏ రూట్‌లో వెళ్తుంది? స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయ్.. ఫుల్ డిటెయిల్స్..

Vizag Metro

Updated On : July 25, 2025 / 1:00 PM IST

Vizag Metro: విశాఖ వాసులకు గుడ్‌న్యూస్. ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న కల నెరవేరడానికి ముందడుగు పడింది. విశాఖ మెట్రోకు టెండర్లు పిలిచింది ఏపీ ప్రభుత్వం. జూలై 25న టెండర్లు పిలుస్తోంది. ఈ క్రమంలో విశాఖలో అసలు మెట్రో ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఎక్కడి వరకు ఉంటుంది? ఏయే ఏరియాల్లో మెట్రో స్టేషన్లు వస్తాయనే సమగ్ర సమాచారం ఇక్కడ తెలుసుకోండి..

అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ అందించిన సమాచారం ప్రకారం.. విశాఖ మెట్రోలో మొత్తం నాలుగు కారిడార్లు ఉంటాయి. మొత్తం 76.90 కి.మీ దూరం కవర్ చేస్తుంది.

మొదటి కారిడార్ : విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు. మొత్తం 34.23 కి.మీ.
మొదటి కారిడార్‌లో వచ్చే స్టేషన్లు: స్టీల్ ప్లాంట్, వడ్లపూడి, శ్రీనగర్, చిన్న గంటాడ, గాజువాక, ఆటోనగర్, బీహెచ్ఈఎల్, షీలానగర్, ఎయిర్ పోర్ట్, కాకాని నగర్, ఎన్ఏడీ జంక్షన్, మాధవధార, మురళీనగర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, అక్కాయపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీ, వెంకోజిపాలెం, హనుమంతవాక, ఆదర్ష్ నగర్, ఇందిరా గాంధీ జూపార్క్, ఎండాడ, క్రికెట్ స్టేడియం, శిల్పారామం, మధురవాడ, కొమ్మాది.

రెండో కారిడార్ : గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్టాఫీసు వరకు. మొత్తం 5.28 కి.మీ.
రెండో కారిడార్‌లో వచ్చే స్టేషన్లు: గురుద్వారా, ద్వారకానగర్, ఆర్టీసీ కాంప్లెక్స్, డాబా గార్డెన్, సరస్వతి సర్కిల్, పూర్ణ మార్కెట్, ఓల్డ్ పోస్టాఫీస్.

మూడో కారిడార్ : తాటిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు. మొత్తం 6.91 కి.మీ.
మూడో కారిడార్‌లో వచ్చే స్టేషన్లు : తాటిచెట్లపాలెం, న్యూ రైల్వే కాలనీ, విశాఖ రైల్వే స్టేషన్, అల్లిపురం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, సంపత్ వినాయక్ టెంపుల్, సిరిపురం, ఆంధ్రా యూనివర్సిటీ, చిన వాల్తేర్ / ఆర్కే బీచ్.

నాలుగో కారిడార్ : కొమ్మాది నుంచి బోగాపురం వరకు. మొత్తం 30.48 కి.మీ.
నాలుగో కారిడార్లో వచ్చే స్టేషన్లు : కొమ్మాది, మరికవలస, పరదేశిపాలెం, బోయపాలెం, గంభీరం, వేములవలస, పెద్దిపాలెం, ఆర్ తాళ్లవలస, తగరపువలస, మహారాజపేట, పోలిపల్లె, సరవిల్లి, భోగాపురం ఎయిర్ పోర్ట్.

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రస్తుతం తొలిదశ కింద రూ.11,498 కోట్ల విలువైన పనులకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ప్రాజెక్టును నిర్మించనున్నాయి. దీన్ని ఎప్పటిలోపు పూర్తి చేయాలనే అంశం టెండర్లలో ఫైనల్ చేయనుంది ప్రభుత్వం.