Pawan Kalyan Deeksha : దీక్ష విరమించిన జనసేనాని పవన్ కళ్యాణ్
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా చేపట్టిన దీక్షను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరమించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో..

Pawan Kalyan Deeksha
Pawan Kalyan Deeksha : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా చేపట్టిన దీక్షను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరమించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన చేపట్టిన నిరసన దీక్ష సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆరున్నర గంటల పాటు పవన్ దీక్ష సాగింది.
Walking : ప్రతిరోజు వాకింగ్ ఎలా చేయాలి? ఏ సమయంలో చేస్తే బెటర్?
విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికుల ఆందోళన 300 రోజులకు పైగా సాగుతోందని.. వారికి నైతికంగా మద్దతిచ్చేందుకు పవన్ దీక్ష చేపట్టినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్ స్పందించాలని దీక్ష సందర్భంగా డిమాండ్ చేశారు పవన్.
దీక్షకు ముందు గన్నవరం నుంచి మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌కు వెళ్లే దారిలో వడ్డేశ్వరంలో శ్రమదానం చేశారు పవన్. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేశారు. పార చేతపట్టి స్వయంగా మట్టి పోశారు.