Vunnamatla eliza: వైసీపీ నుంచి టిక్కెట్ కోసం అమరావతిలోనే ఎమ్మెల్యే మకాం.. ఉత్కంఠ..
వైసీపీ నుంచి ఏలిజాకు సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా చింతలపూడి నుంచే పోటీ చేస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

vunnamatla eliza-Jagan
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉండడంతో నేతలు టిక్కెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వున్నమట్ల ఏలిజా అమరావతిలోనే మాకాం వేశారు. అలాగే, చింతలపూడి నుంచే పోటీ చేయాలని విజయరాజు భావిస్తున్నారు.
మొదటి, రెండవ లిస్టులో చింతలపూడి సీటు మార్పు లేకపోవడంతో ఎవరి పేరు ఖరారు అవుతుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రానికి చింతలపూడి సీటు విషయాన్ని వైసీపీ అధిష్ఠానం ఖరారు చేయనుంది. చింతలపూడి నుంచి ఏలిజానే పోటీ చేస్తారని కొందరు వైసీపీ నేతలు అంటున్నారు.
సీటు తనదేనంటూ ఇప్పటికే నియోజకవర్గంలో వైసీపీ పెద్దలను కలుస్తున్నారు విజయరాజు. టిక్కెట్ పంచాయితీ ఎటూ తేలక పోవడంతో చింతలపూడి వైసీపీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. ఇరువర్గాల నేతలు అమరావతిలోనే మకాం వేశారు.
వైసీపీ నుంచి ఏలిజాకు సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా చింతలపూడి నుంచే పోటీ చేస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. వైసీపీ నుంచి సీటు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచైనా పోటీ చేసేందుకు ఏలిజా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Kesineni Nani: ఎన్నికల వేళ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ షాక్