AP Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

మంగళ, బుధ, గురువారాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

AP Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Updated On : October 14, 2024 / 7:27 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో నేడు ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో నాలుగు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

ఇవాళ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. మంగళ, బుధ, గురువారాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

ఏపీలో అల్పపీడన ప్రభావం మొదలైంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, తూ.గో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం చేరుకుంది. తిరుపతిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

Gold And Silver Price: గుడ్‌న్యూస్‌.. బంగారం, వెండి ధరల్లో తగ్గుదల