తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Rains: అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Weather News

Updated On : May 24, 2024 / 9:27 AM IST

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 25 వరకు తుపాన్‌గా మారితే రెమల్‌గా నామకరణం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజులపాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అన్నారు. కోస్తాంధ్ర తీర ప్రాంత జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉందని తెలిపారు.

పార్వతీపురం మన్యంతో పాటు కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అంతేగాక, అనకాపల్లి, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

తిరుమలలోని పలు ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్