లిక్కర్ లెక్కలు తేల్చేపనిలో కూటమి సర్కార్! ఇప్పటికే అమిత్ షా దగ్గరకు చేరిన లిక్కర్ లెక్కలు

అంతేకాకుండా కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్‌ఆఫ్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులను కలిసి నోటీసులు ఇచ్చారు.

లిక్కర్ లెక్కలు తేల్చేపనిలో కూటమి సర్కార్! ఇప్పటికే అమిత్ షా దగ్గరకు చేరిన లిక్కర్ లెక్కలు

Updated On : April 17, 2025 / 8:58 PM IST

లిక్కర్ స్కాం లెక్కల్ని తేల్చే పనిలో కూటమి సర్కార్ నిమగ్నమైందా? వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం గుట్టును రట్టు చేసేందుకు యాక్షన్ ప్లాన్ ను స్పీడప్ చేసిందా? చుక్క చుక్కలో జరిగిన అవినీతిని కక్కించేందుకు…కలుగుల్లో దాక్కున్న ఎలుకలను బయటకు రప్పిస్తోందా? మిథున్ రెడ్డి, కసిరెడ్డి సిట్ ముందు ఏం చెప్పబోతున్నారు? విచారణకు డుమ్మా కొడుతున్న కసిరెడ్డి ఇంతకీ ఎక్కడ ఉన్నాడు? వాచ్ దిస్ స్టోరీ.

ఏపీలో గత వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను స్పీడప్ చేస్తోంది. ఈ స్కాంలో ఎవరున్నా..ఎంతమంది ఉన్నా వారందరిని బయటకు లాగేందుకు ఇప్పటికే ఏర్పాటైన సిట్ విచారణను స్పీడప్ చేసింది. అందులో భాగంగానే సిట్ విచారణకు హాజరు కావాలంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసింది.

మద్యం కుంభకోణంలో శుక్రవారం విచారణకు రావాల్సిందిగా ఏపీ సిట్ నోటీసులు జారీ చేయడంతో మిథున్ రెడ్డి వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా న్యాయవాదిని అనుమతించాలని, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. మిథున్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు విచారించింది.

Also Read: శ్రేయాస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్‌.. ఇది తప్పనిసరి.. పాటించకపోయారో..

అంతుకు ముందు కూడా ఇదే కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఎంపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీన్ని హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ఎంపీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు విచారణకు సహకరించాలని ఎంపీని ఆదేశించింది.

కర్త, కర్మ, క్రియ కసిరెడ్డేనా? 
మరోవైపు ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం సిట్ ముందు విచారణకు హాజరుకావల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నట్లు సమాచారం పంపారు. అయితే మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డే అంటూ కొద్దిరోజుల క్రితం మీడియా ముందే సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

లిక్కర్ స్కాంలో తనకు తెలిసిన వివరాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సాయిరెడ్డి చెప్పడంతో సిట్ విచారణలో ఎలాంటి విషయాలు బయటపెడతారన్న ఉత్కంఠ ఉంది. సాయిరెడ్డిని విచారించేందుకు సిట్ సిద్దంగా ఉన్నా…గురువారం హాజరుకాలేదు. మరోసారి వస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి ఎప్పుడొస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సాక్షిగా విజయసాయి చెప్పే అంశాలు మద్యం కుంభకోణం కేసులో కీలకం అవుతాయని సిట్ అధికారులు భావిస్తున్నారట.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నారని ఇప్పటికే నిర్ణారణ అయిందని ఓ టాక్ నడుస్తోంది. దీనిపై విచారణ జరిపిన సిట్..పలు కీలక ఆధారాలను కూడా సేకరించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తానికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూత్రధారి అని, ఆయన కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం నడిచిందని సిట్ ఓ నిర్ణారణకు వచ్చిందట. ఇప్పటికే మూడు సార్లు విచారణకు రావాల్సిందిగా కసిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసినా మూడు సార్లు కూడా విచారణకు డుమ్మా కొట్టారు.

అంతేకాకుండా కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్‌ఆఫ్ చేయడంతో ఆయన కుటుంబసభ్యులను కలిసి నోటీసులు ఇచ్చారు. అలాగే కసిరెడ్డి తండ్రికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. గత ఐదేళ్లలో మద్యం ద్వారానే కసిరెడ్డి అక్రమంగా ఆస్తులను సంపాదించారని సిట్ ఇప్పటికే గుర్తించిందట. ఆ డబ్బు ద్వారానే అనేక సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని, సినిమా కూడా తీశారని సిట్ అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు సిట్ రెడీ అవుతోంది. లిక్కర్ స్కాంలో ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఎవరనేది త్వరలోనే బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.