చంద్రన్న కోసం బండ్లన్న యాత్ర.. కారణాలేంటి? ట్రెండింగ్ టాక్స్
బండ్ల గణేశ్ తెలంగాణ కాంగ్రెస్ లీడర్‌గా ఉన్నారు. ఆయన ఏపీ సీఎం..పైగా టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పాదయాత్ర చేయడమే ఇంట్రెస్టింగ్ టాక్‌గా మారింది.
Bandla Ganesh (Pic: @ganeshbandla Twitter )
- కాంగ్రెస్ నేతగా ఉండి యాత్ర
- హంగు, ఆర్భాటంతో షురూ
- బండ్ల గణేశ్ చూపు ఏపీపై పడిందా?
Bandla Ganesh: బండ్ల గణేశ్.. తెలుగు స్టేట్స్‌లో పరిచయం అక్కర్లేని పేరు. సినిమాల్లో కమెడియన్‌గా.. నిర్మాతగా.. లేటెస్ట్‌గా పొలిటికల్ లీడర్‌గా..వైరల్ స్టార్‌గా ఫుల్ పాపులర్ బండ్ల గణేశ్. ఆయన ఏది మాట్లాడినా సమ్‌థింగ్ స్పెషలే.
ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడటం బండ్ల గణేశ్ స్టైల్. 2018 ఎన్నికలప్పటి నుంచి బండ్ల గణేశ్ పొలిటికల్‌గా అంతో ఇంతో యాక్టీవ్‌గా ఉంటున్నారు. 2018లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గొంతు కోసుకుంటున్నాంటూ స్టేట్మెంట్ ఇచ్చి..అప్పట్లో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రమాణస్వీకారానికి ఒక రోజు ముందే ఎల్బీ స్టేడియంకు వెళ్తానంటూ బండ్ల గణేశ్ ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అయిపోయింది.
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత బండ్ల గణేశ్ కొద్దిరోజలు బాగానే హడావుడి చేశారు. ఏకంగా ఎమ్మెల్సీ, రాజ్యసభ అంటూ ప్రచారం కూడా భారీగానే జరిగింది. అయితే రీజనేంటో తెలియదు కానీ ఆ తర్వాత ఆయనను కాంగ్రెస్‌లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో దాదాపు సైడ్ అయిపోయారు బండ్ల గణేశ్.
Also Read: YS Jagan: క్యాడర్‌తో మీటింగ్స్.. జగన్ స్ట్రాటజీస్ ఛేంజ్..!
కట్ చేస్తే..ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారాయన. ఏపీ సీఎం చంద్రబాబు కోసం సంకల్ప యాత్ర పేరుతో తిరుమలకు పాదయాత్ర చేపట్టి..చర్చకు దారితీశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నుంచి యాత్ర స్టార్ట్ అయింది. దాదాపు 500 కిలోమీటర్ల మేర గణేశ్ యాత్ర సాగనుంది.
చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బండ్ల గణేశ్ ఆవేదన
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బండ్ల గణేశ్ తీవ్రంగా బాధపడ్డారట. ఆ కేసు నుంచి చంద్రబాబు బయటపడటంతో పాటు మళ్లీ అధికారంలోకి రావాలని అప్పట్లో మొక్కుకున్నారట. ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకునేందుకే తిరుమలకు యాత్ర చేపట్టినట్లు ఆయన చెప్తున్నారు. ఇది పూర్తిగా భక్తిభావంతో చేస్తున్న యాత్ర అని, రాజకీయ యాత్ర కాదని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు. ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తిరేపుతోంది.
బండ్ల గణేశ్ సినిమా కెరీర్ ఎలా అయితే ప్రారంభమైందో పొలిటికల్ కెరీర్ కూడా అలాగే చాలా కన్ఫ్యూజన్‌గా సాగుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకు రాజకీయాల్లో బండ్ల గణేశ్ వ్యవహార శైలి, సంచలన వ్యాఖ్యలే కారణమంటున్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తూ ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా ఉంటుంటారు బండ్ల గణేశ్.
స్పీచ్‌లతో దుమ్మురేపుతున్న బండ్ల గణేశ్
ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లకు హాజరవుతూ తన స్పీచ్‌లతో దుమ్మురేపుతున్నారు. మైక్ పట్టుకుంటే చాలు బండ్లన్నకు పూనకం వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ మధ్య నిర్మాత అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అయిపోయాయి. బండ్లన్న కామెంట్స్‌తో నిర్మాత బన్నీవాసు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
లేటెస్ట్‌గా హీరో కిరణ్ అబ్బవరాన్ని చిరంజీవితో పోల్చిన బండ్ల గణేశ్..విజయ్ దేవరకొండని టార్గెట్ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. ఇక పవన్ కల్యాణ్ గురించి ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. పవన్ కల్యాణ్ తనకు దేవుడైనా సరే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతానని అన్నారు బండ్ల గణేశ్.
ఇలా మనసులో ఉన్నది మాట్లాడేసి ఇరకాటంలో పడిపోవడం బండ్ల గణేశ్ స్టైల్. అయితే తన కామెంట్స్‌తో రచ్చ అయినప్పుడు సైలెంట్ మోడ్‌లో ఉండిపోతుంటారు కూడా. అలా కాంట్రవర్సీ కామెంట్స్ కేరాఫ్‌గా ఉండే బండ్ల గణేశ్..ఇప్పుడో మరో ఇంట్రెస్టింగ్ చర్చకు దెరతీశారు.
హంగు, ఆర్భాటం ఎందుకు?
బండ్ల గణేశ్ తెలంగాణ కాంగ్రెస్ లీడర్‌గా ఉన్నారు. ఆయన ఏపీ సీఎం..పైగా టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పాదయాత్ర చేయడమే ఇంట్రెస్టింగ్ టాక్‌గా మారింది. కాంగ్రెస్ నేత..టీడీపీ అధినేత కోసం యాత్ర చేయడం ఏంటన్నది పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. ఒకవేళ చంద్రబాబు కోసం పాదయాత్ర చేసినా..ఓపెన్‌గా ప్రకటన చేసి ..హంగు, ఆర్భాటం చేసి యాత్రకు బయలుదేరడం వెనుక ప్లాన్ ఏంటన్న చర్చ నడుస్తోంది.
మొత్తానికి బండ్ల గణేశ్ చేపట్టిన ఈ యాత్ర సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. సెలబ్రిటీలు సాధారణంగా రాజకీయ పరిణామాలపై మౌనంగా ఉండే రోజుల్లో, ఇంత బహిరంగంగా చంద్రబాబు కోసం మొక్కు చెల్లించుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరి తెలంగాణలో రాజకీయం అయిపోయింది..ఇక బండ్ల గణేశ్ చూపు ఏపీపై పడిందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
