Krishna District : వాట్సాప్ స్టేటస్ వివాదం.. కత్తితో దాడి
వాట్సాప్ స్టేటస్ ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చురాజేసింది. వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకు గాను తన స్నేహితుడి కుటుంబంపై దాడి చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

Krishna District
Krishna District: వాట్సాప్ స్టేటస్ ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చురాజేసింది. వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకు గాను తన స్నేహితుడి కుటుంబంపై దాడి చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా నూజివీడు మండలం లీలానగర్ కాలానికి దుర్గాప్రసాద్, వరప్రసాద్ స్నేహితులు.
వీరిద్దరు కలిసి గతంలో సెల్ఫీ దిగారు. దానిని మంగళవారం వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు దుర్గప్రసాద్. దానిని చూసిన వరప్రసాద్ తన స్నేహితులను తీసుకోని దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చి గొడవ పడ్డాడు. అనంతరం కత్తులతో కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. ఇంట్లోని వారిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో దుర్గాప్రసాద్ కు బలమైన గాయాలయ్యాయి.
అతడితోపాటు ఇంట్లో ఉన్న మరో ఇద్దరిని కూడా గాయపరిచారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.