ఖాకీ చొక్కా వదిలేసిన యంగ్ ఐపీఎస్ సిద్ధార్థ్‌ కౌశల్‌.. హీరోయిన్ జత్వానీ కేసులో ఆరోపణలు.. ఫుల్ డీటెయిల్స్‌..

గతంలోనూ పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాజకీయ నేతలు చెప్పినట్లు నడుచుకుని ఇబ్బందులు ఫేస్ చేసిన సందర్భాలున్నాయి.

ఖాకీ చొక్కా వదిలేసిన యంగ్ ఐపీఎస్ సిద్ధార్థ్‌ కౌశల్‌.. హీరోయిన్ జత్వానీ కేసులో ఆరోపణలు.. ఫుల్ డీటెయిల్స్‌..

Siddharth Kaushal

Updated On : July 3, 2025 / 8:48 PM IST

సిద్ధార్థ్ కౌశల్.. యంగ్ ఐపీఎస్ ఆఫీసర్. మంచి పేరు కూడా ఉంది. పైగా పోలీసు డ్యూటీలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న నేమ్‌ కూడా సంపాదించుకున్నారు. అలాంటి సిద్ధార్థ్ కౌశల్ పోలీస్‌ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవడం..అందుకోసం వాలంటరీ రిటైర్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కౌశల్..13ఏళ్లలో ఏపీ క్యాడర్ పోస్టుల్లో కీలకంగా పనిచేశారు. నిఖార్సైన అధికారిగానే పేరు తెచ్చుకున్న ఆయనకు..ఏడాదికి క్రితం సంచలనం సృష్టించిన ఓ కేసు మరకలు అంటించింది.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా తన పేరు కాంట్రవర్సీల్లో ఇరుక్కోకుండానే పనిచేశారు సిద్ధార్థ్‌ కౌశల్. అయితే ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసులో ఆయన కట్టు తప్పారన్న వాదనలు ఉన్నాయి. నాటి విజయవాడ పోలీసు కమిషనర్ క్రాంతి రాణా..ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులులతో కలిసి వైసీపీ నేతలు చెప్పినట్టుగా నడుచుకుని సిద్ధార్థ్‌ కౌశల్ చిక్కుల్లో పడ్డారన్న చర్చ ఉంది. ఈ క్రమంలో ఇంకో 20ఏళ్ల సర్వీస్ ఉండగానే సిద్ధార్థ్‌ కౌశల్‌ VRS నిర్ణయం తీసుకున్నారన్న చర్చ లేకపోలేదు.

Also Read: కొండా దంపతులు కాంట్రవర్సీని కొని తెచ్చుకుంటున్నారా? నెక్ట్స్‌ ఏంటి?

కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక..గత సర్కార్‌ హయాంలో తనను తీవ్రంగా ఇబ్బందిపెట్టారని నటి జెత్వానీ ఏపీ ప్రభుత్వానికి మొరపెట్టుకోగా..సర్కార్‌ యాక్షన్‌కు దిగింది. విచారణలో భాగంగా..సిద్ధార్థ్‌ కౌశల్, క్రాంతి రాణా, పీఎస్ఆర్ ఆంజనేయులతో పాటు పలువురి పేర్లు తెరపైకి రావడం..వారిపై కేసులు నమోదు కావడం చకచకా జరిగిపోయాయి.

అంతేకాకుండా ఈ ముగ్గురిని సస్పెండ్ చేసిన కూటమి సర్కారు రోజూ డీజీపీ ఆఫీస్‌లో సంతకం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులోనే ఇటీవలే పీఎస్ఆర్ అరెస్టు కాగా..సిద్ధార్థ్‌ కౌశల్, క్రాంతి రాణా కూడా అరెస్టు అవుతారన్న టాక్ వినిపించింది. అయితే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకుండా సిద్ధార్థ్‌ కౌశల్‌కు డీజీపీ ఆఫీస్‌లో ఎస్పీ అడ్మిన్ పోస్టు ఇచ్చింది. యంగ్‌ ఆఫీసర్‌ అయిన తనను..ఏ మాత్రం పనిలేని పోస్ట్‌లో పెట్టడం సిద్ధార్థ్‌ కౌశల్‌కు నచ్చలేదని..అందుకే రిజైన్ చేశారని వైసీపీ వాయిస్ రేజ్ చేస్తోంది.

పొలిటికల్ బాస్ చెప్పినట్లు నడుచుకోవడంతో ఇబ్బందులు
కూటమి సర్కార్ ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే సిద్ధార్థ్‌ కౌశల్‌ లాంటి మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌ కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయడం సరైందేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఐపీఎస్‌ హోదాలో ఎన్నో కేసులు చూసి..లీగల్‌గా ఒక లైన్‌ దాటి ఎలా బిహేవ్‌ చేయొద్దో అలా ప్రవర్తించి..పొలిటికల్ బాస్ చెప్పినట్లు నడుచుకోవడమే..ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టిందన్న టాక్ ఉంది.

జెత్వానీ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించారని సీఐడీ ఇచ్చిన రిపోర్ట్‌ బేస్‌గానే సర్కార్ నడుచుకుందని అంటున్నారు. ప్రభుత్వం అందుకే అతడ్ని పక్కకు పెట్టి ఉండొచ్చని..అయినా సిద్ధార్థ్‌ కౌశల్‌ విషయంలో ఏపీ సర్కార్‌ కక్ష పూరితంగా వ్యవహరించలేదంటున్నారు టీడీపీ నేతలు. లీగల్‌గా, డిపార్ట్‌మెంట్ పరంగా ఎలా నడుచుకోవాలో అలానే ప్రభుత్వం నడుచుకుందని..ఎక్కడ పర్సనల్ టార్గెట్ చేయలేదంటున్నారు.

సిద్ధార్థ్‌ కౌశల్‌ రాజీనామా నుంచి..బ్యూరోక్రాట్స్, సివిల్‌ సర్వీస్‌లో ఉన్న అధికారులు..నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటున్నారు. తనకు తానుగా సిద్ధార్థ్‌ కౌశల్ తప్పేం చేయకపోవచ్చు. కూటమి సర్కార్ తనకు మంచి పోస్టింగ్‌ ఇవ్వలేదన్న బాధ కూడా ఉండొచ్చు. కానీ పొలిటికల్ బాస్‌ చెప్పినట్లు రూల్స్‌ పట్టించుకోకుండా అడ్డగోలుగా బిహేవ్ చేయడమే..ప్రభుత్వం మారాక ఆయనకు ఇబ్బందులు తెచ్చి పెట్టిందంటున్నారు.

గతంలోనూ పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాజకీయ నేతలు చెప్పినట్లు నడుచుకుని ఇబ్బందులు ఫేస్ చేసిన సందర్భాలున్నాయి. అయితే సిద్ధార్థ్‌ కౌశల్‌ విషయంలో ఇప్పటికేం మించి పోయింది కూడా లేదంటున్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్స్‌. VRS దరఖాస్తు పెట్టుకున్న 90 రోజుల్లోపు అది వెనక్కి తీసుకోవచ్చని..పునరాలోచించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు కూడా సిద్ధార్థ్‌ కౌశల్‌కు నచ్చజెప్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో VRS నిర్ణయానికే కట్టుబడి ఉంటారా.? లేక ఆయన తిరిగి ఉద్యోగంలో చేరుతారా అనేది వేచి చూడాలి.